బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు షారుక్ ఖాన్ (Shahrukh Khan) ఒకరు.నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి షారుఖ్ ఖాన్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.
అయితే దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత షారుక్ ఖాన్ పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది.
ఇక ఈ సినిమా విడుదలైనటువంటి నెలల వ్యవధిలోనే జవాన్ సినిమా(Jawan Movie) ద్వారా షారుఖ్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకుంది.ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక సినిమాల పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి షారుక్ ఖాన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అనే సంగతి మనకు తెలిసిందే.
ఈయన తరచూ అభిమానులతో (Shahrukh Khan Fans) చిట్ చాట్ చేస్తూ తన సినిమాని ప్రమోట్ చేస్తూ ఉంటారు.అలాగే అభిమానులు అడిగే ప్రశ్నలకు సరదాగా సమాధానాలు కూడా చెబుతూ ఉంటారు.
ఈ క్రమంలోని ఈయన సరదాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఇక ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఒక లేడీ ఫ్యాన్ షారుక్ ఖాన్ ను ప్రశ్నిస్తూ నేను మీ సొట్ట బుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా అని అడిగారు దీంతో షారుక్ చెప్పిన సమాధానం వింటే అందరూ షాక్ అవ్వాల్సిందే.ఈ ప్రశ్నకు షారుక్ సమాధానం చెబుతూ కుడివైపుదా లేక ఎడమవైపుదా? దయచేసి ముందుగానే బుక్ చేసుకోండి అంటూ ఈయన చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.