రామ్ చరణ్ కు కండిషన్ పెట్టిన షారుక్ ఖాన్... అలా చేస్తేనే వస్తానంటూ?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చాలా సంవత్సరాల తర్వాత పఠాన్ సినిమా ద్వారా ఈనెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇలా ఈ సినిమా 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 Shah Rukh Khan Wants Ram Charan To Take Him Visit Theatre South, Shah Rukh Khan,-TeluguStop.com

ఇక విడుదల తేదీ కూడా దగ్గరపడటంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు షారుఖ్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కలిసి ముచ్చటించారు.

Telugu Oscar Awards, Pathan, Ram Charan, Shah Rukh Khan, Theaters, Telugu, Tolly

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో విడుదల కాబోతున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అభిమానులతో ముచ్చటించిన షారుఖ్ ఖాన్ కు వివిధ రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి అయితే ఇందులో ఓ ప్రశ్న మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ షారుక్ ను ప్రశ్నిస్తూ.హాయ్ సర్ మీరు పఠాన్ సినిమా విడుదలైన సమయంలో తెలుగు రాష్ట్రాలలోని మూవీ థియేటర్స్ కు వస్తారా అని ప్రశ్నించారు.

Telugu Oscar Awards, Pathan, Ram Charan, Shah Rukh Khan, Theaters, Telugu, Tolly

ఈ ప్రశ్నకు షారుక్ సమాధానం చెబుతూ…తప్పకుండా వస్తాను అయితే నన్ను రామ్ చరణ్ వచ్చి తీసుకు వెళ్తేనే వస్తాననే కండిషన్ పెట్టారు.ఇలా షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ తీసుకువెళ్తేనే వస్తానంటూ మెగా పవర్ స్టార్ గురించి ప్రస్తావించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.అయితే వ్యక్తిగతంగా షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.

అదేవిధంగా RRR సినిమాకు వచ్చే ఆస్కార్ ను నన్ను కూడా ఒక్కసారి తాకనివ్వండి అంటూ రామ్ చరణ్ కు షారుక్ ట్వీట్ చేయడం విశేషం.ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందనే చెప్పాలి మరి షారుక్ పెట్టిన కండిషన్ కు రాంచరణ్ ఒప్పుకొని తనని థియేటర్ కి తీసుకు వస్తారా లేదా తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube