అసెంబ్లీ నుండి సీతక్క వాకౌట్.. ఏం జరిగిందంటే..?

తెలంగాణ అసెంబ్లీ ( Telangana Assembly ) వర్షాకాల సమావేశాలు చివరి రోజు సాగుతున్నాయి.ఈ సందర్భంగా సమావేశాల నుంచి ఎమ్మెల్యే సీతక్క( MLA Seethakka )ను వాకౌట్ చేసేసారు.

 Congress Mla Seethakka Walkout From The Assembly,assembly,congress Mla Seethakka-TeluguStop.com

అనంతరం ఎమ్మెల్యే సీతక్క బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు.తనకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుంది అని అర్థం కావడం లేదని, విపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చివరికి జీరో అవర్( Zero Hour ) లో కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని,ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సమస్యలు లేవనెత్తే అవకాశం నాకు ఉందని, ప్రధాన పార్టీ నాయకులు కనీసం మాట్లాడడానికి కూడా నాకు చాన్స్ ఇవ్వడం లేదని , నేను మాట్లాడదామంటే మధ్యలోనే మైక్ కట్ చేస్తున్నారని, అదే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంతసేపు మాట్లాడిన మైక్ కట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం ఎన్నికల ప్రచారం కోసమే ఈ సభను బిఆర్ఎస్ ( BRS ) వాడుకుంటుందని, కేవలం నాలుగున్నర సంవత్సరాల క్రితమే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు 9 ఏళ్ల అభివృద్ధి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.జీరో అవర్ లో కూడా కనీసం అవకాశం ఇవ్వడం లేదని, అసలు అసెంబ్లీ సభ నిర్వహణ చాలా బాధాకరంగా ఉందని సీతక్క ( Seethakka ) ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే మిషన్ భగీరథ ( Mission Bhageeradha ) నీళ్లు అన్ని ఊర్లలో వస్తుంటే కొత్త కొత్త వాటర్ ప్లాంట్ లు ఎందుకు వెలుస్తున్నాయని, అసలు అసెంబ్లీలో లేనటువంటి రేవంత్ రెడ్డి ( Revanth reddy ) గురించి మాట్లాడి మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube