సాధారణంగా ఈ భూమ్మీద మాట్లాడే పక్షులు ఏవైనా వున్నాయంటే అవి రామచిలుకలే.( Parrots ) మనుషులు మాట్లాడే మాటలు వింటూ, అవే మాటలను తిరిగి అవి అనుకరిస్తూ ఉంటాయి.
ఈ చిలక పలుకులను జనాలు చాలా ఎంజాయ్ చేస్తూ వుంటారు.అయితే ఈ స్మార్ట్ యుగంలో రామచిలుకలు మాట్లాడటమే కాదు, ఏకంగా వీడియోకాల్స్ ( Video Calls ) కూడా మాట్లాడేస్తున్నాయి మరి.ఇంతకీ అవి ఎవరితో మాట్లాడుతున్నాయో తెలుసా? తోటి పక్షులతోనే.అవును, వినడానికి ఆశ్చర్యంగా వున్నా, ఇది నిజం.
మాటలు నేర్చుకునే చిలుకలకు వీడియోకాల్స్ నేర్పిస్తే ఎందుకు నేర్చుకోలేవు? అన్న ఆలోచన వచ్చిన శాస్త్రవేత్తలు ( Scientists ) కొన్ని రామచిలుకలకు ప్రయోగాత్మకంగా వీడియోకాల్స్ చేయడం వంటివి నేర్పించారు.ఈ విద్యను అవి ఇట్టే నేర్చుకుని, దూర దూరాల్లో ఉంటున్న తమ పక్షి నేస్తాలకు ఎడాపెడా వీడియోకాల్స్ చేసి, చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నట్టు చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
వివరాల్లోకి వెళితే, అమెరికాలోని నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, అదేవిధంగా మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), మరియు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఒక బృందంగా ఏర్పడి, కొన్ని ఎంపిక చేసిన రామచిలుకలకు వీడియోకాల్స్ నేర్పించడంలో విజయం సాధించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ నేపధ్యం వారు ఇళ్లల్లో పంజరాల్లో పెరిగే రామచిలుకలు ఈ వీడియోకాల్స్ ద్వారా ఒంటరితనాన్ని కూడా మరచిపోగలుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు.