విలక్షణమైన సినిమాలు, పాత్రలతో మెప్పిస్తోన్న సత్యదేవ్ హీరోగా రామాంజనేయులు జవ్వాజి, ఎస్.డి.
కంపెనీ నిర్మాణంలో సర్వాంత్ రామ్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఫన్ రైడర్ ‘ఫుల్ బాటిల్’.ఫన్, ఫాంటసీ సహా అన్ని ఎలిమెంట్స్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. శరణ్ కొప్పిశెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ పోస్టర్ యూనిక్‌గా ఉంది.సినిమా ఎలా ఉండబోతుందోనని ఆసక్తిని కలిగించేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు.
సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ తెలిపారు.సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి సంతోష్ కామిరెడ్డి ఎడిటర్.
నవీన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.