ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో గతంలోని ఇసుక విధానం రద్దు చేయడం కూడా ఒకటి.ఈ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రం భారీగా నష్టపోయింది.
ఇసుక కొరతతో భవన నిర్మాణాలు ఆగిపోయాయి.రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఈ రంగంపై ఆధారపడిన సుమారు 30 లక్షల మంది కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఇందులో చాలా మంది పనుల్లేక, అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారు.తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది.గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్లయ్యనగర్‌లో ఇద్దరు తాపీ మేస్త్రీ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.ఆరు నెలలుగా ఏ పనీ దొరక్కపోవడంతో ఇన్నాళ్లూ అప్పులు చేసుకుంటూ వచ్చారు.
ఇప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో వాటిని తీర్చే మార్గం లేక ఇద్దరూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.బాధితులను పోలిశెట్టి పూర్ణచంద్రరావు, ఆదిలక్ష్మిగా గుర్తించారు.
గతంలోనూఊ ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం.ఇదే గుంటూరు జిల్లాలో ఓ ప్లంబర్ కూడా ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో తన కష్టాలు చెప్పుకున్నాడు.