రూ.10 వేల ధరతో అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ న్యూ ఫోన్ త్వరలోనే లాంచ్..

శాంసంగ్ అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ ధరల్లోనే ఫోన్లు తీసుకొస్తోంది.ఇటీవలే మరో ఫోన్ రిలీజ్ చేసింది.

 Samsung Launches New Phone Soon With Features Priced At Rs 10,000.  , 10 Thousan-TeluguStop.com

అయితే ఇది ప్రస్తుతం వియత్నాం దేశంలో మాత్రమే రిలీజ్ అయ్యింది.అయితే ఇప్పుడది అతి త్వరలోనే భారతదేశంలో కూడా రిలీజ్ అవుతుందని ప్రముఖ టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.

కొత్తగా రిలీజ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ మోడల్ పేరు గెలాక్సీ ఏ03.ఈ గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్ ఇప్పుడు ఇండియాలో మిడ్‌రేంజ్ సెక్షన్ లో శాంసంగ్ తీసుకురానుంది.

ఈ ఫోన్ రెండు రకాల ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.ఈ బడ్జెట్ రేంజ్ మొబైల్ ఫోన్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌ సాయంతో పనిచేస్తుంది.

ఇప్పుడు దీని ధర, స్పెసిఫికేషన్ల వంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రముఖ టిప్‌స్టర్ల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఏ03 మోడల్ లోని బేస్ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ధర రూ.10,499గా నిర్ణయించవచ్చు.అలాగే 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.11,999గా ఉండొచ్చు.అయితే ఈ విషయంపై శాంసంగ్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

కాకపోతే టిప్‌స్టర్ల కథనాలు చాలావరకు విశ్వసనీయంగా ఉంటాయి.అందువల్ల దాదాపు రూ.11 వేల ధరతో ఇవి అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.మార్చి నెలలో మొదటి వారంలో ఈ ఫోన్ ఇండియాలో రిలీజ్ కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఏ03 స్పెసిఫికేషన్లు చూసుకుంటే… ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లే, ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌, స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే ఫెసిలిటీ అందించారు.ఈ అద్భుతమైన ఫీచర్లతో పాటు బెస్ట్ కెమెరాలు కూడా అమర్చారు.

ఇందులో వెనకవైపు రెండు కెమెరాల ఇవ్వగా అందులో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్.రెండో కెమెరాగా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు.

అలాగే వాటర్ డ్రాప్ నాచ్‌లో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆఫర్ చేస్తున్నారు.ఇక సాలిడ్ బ్యాటరీ కూడా ఇందులో అందించడం విశేషం.5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వస్తుంది.డాల్బీ అట్మాస్‌, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube