చాలావరకు సినిమాలు ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ లలో బాగా తెరకెక్కుతాయి.ఇక కొన్ని క్రీడా నేపథ్యంలో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
ఇప్పటికే క్రీడా నేపథ్యంలో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి.అందులో క్రికెట్, కబడ్డీ, బాక్సింగ్ ఇలా పలు క్రీడల నేపథ్యంలో తెరకెక్కి మంచి సక్సెస్ లను అందుకున్నాయి.
ఇక ఎక్కువగా క్రికెట్, బాక్సింగ్ నేపథ్యంలో సినిమాలను బాగా ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు.మామూలుగా ఎప్పుడో ఒకసారి విడుదలయ్యే క్రీడా నేపథ్య సినిమాలు.
ఇప్పుడు ఒకే ఏడాదిలో 4 బాక్సింగ్ సినిమాలతో ముందుకు రానుంది.తెలుగులో బాక్సింగ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’, రవితేజ నటించిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి.
ఇక మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ సినిమా కూడా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది.ఇక ఈ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతుంది.
ఈ సినిమా వైలెంట్ గా కాకుండా డిఫరెంట్ స్టైల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.అంతేకాకుండా మరో యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’ సినిమా కూడా బాక్సర్ నేపథ్యంలో తెరకెక్కనుందట.
ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక ఇవే కాకుండా బాలీవుడ్ లో స్టార్ హీరో ఫర్హాన్ అక్తర్ నటించిన ‘తుఫాన్’ సినిమా కూడా బాక్సింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమాకు రాకేష్ ఓం ప్రకాష్ మెహర దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా ఈ నెల 16న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.
రంజిత్ దర్శకత్వంలో ఆర్య నటిస్తున్న సినిమా ‘సర్పట్ట పరంబరై’.ఈ సినిమా కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కనుంది.
ఇది ఈ నెల 22న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమాను తెలుగు డబ్బింగ్ తో కూడా తెరకెక్కించనున్నారు.
మొత్తానికి ఒకే ఏడాది నాలుగు సినిమాలు పైగా బాక్సింగ్ నేపథ్యంలో ముందుకు రానుండగా క్రీడా అభిమానులకు శుభవార్త అనే చెప్పవచ్చు.