ఈ మధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులోపడి పచ్చని కాపురం బుగ్గి పాలు చేసుకుంటున్నారు.కాగా తాజాగా ఓ వ్యక్తి తను కష్టపడి సంపాదించిన అంతా తన ప్రియురాలికి దోచి పెడుతున్నాడని కన్న కొడుకు తన తండ్రిని ప్లాన్ చేసి మరి మర్డర్ చేయించిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని నరసరావు పేట పరిసర ప్రాంతంలో మల్లికార్జున రావు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై రియల్ ఎస్టేట్ మరియు ఇతర వ్యాపారాలు చేసేవాడు.
ఈ క్రమంలో డబ్బులు బాగానే సంపాదించాడు.కాగా తాజాగా ఓ అందమైన మహిళతో పరిచయం ఏర్పడింది.
దీంతో అప్పుడప్పుడు మల్లికార్జున రావు మహిళకి ఆర్థికంగా సహాయం చేసేవాడు.దాంతో ఈ పరిచయం కాస్త అతికొద్ది సమయంలోనే వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ క్రమంలో మల్లికార్జున రావు ఇంటికి కూడా వెళ్లకుండా మహిళతోనే ఎక్కువ సమయం గడిపేవాడు.
దీంతో మల్లికార్జున రావు కొడుకు ఆవేశంతో రగిలిపోయాడు.ఈ క్రమంలో ఎలాగైనా తన తండ్రిని హతమార్చాలని పన్నాగం పన్నాడు.ఇందులో భాగంగా డబ్బు కోసం హత్యలు చేసే ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని మల్లికార్జున రావుని హత్య చేయించాడు.
ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు పోలీసులకు సమాచారం అందించాడు.అయితే మల్లికార్జున రావు కొడుకు ప్రవర్తనలో మార్పు గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా తన తండ్రి కష్టపడి సంపాదించిన సంపాదన ప్రియురాలికి దోచి పెడుతున్నాడని తానే హత్య చేయించినట్లు నేరం అంగీకరించాడు.