సమంత 'శాకుంతలం' రిలీజ్ డేట్‌ పై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, గుణశేఖర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ఈ సినిమా షూటింగ్ పూర్తయి నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వక పోవడంతో సమంత అభిమానులు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు.

 Samantha Shakuntalam Movie Release Date Details, Shaakunthalam Movie, Heroine Sa-TeluguStop.com

షూటింగ్ పూర్తి అయ్యి ఎన్ని నెలలు అవుతున్నా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ అంటూ ఏంటి ఇంత హడావుడి అంటూ అభిమానులు ట్రోల్స్ మొదలు పెట్టారు.సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయవచ్చు కదా అంటూ సోషల్ మీడియా లో డిమాండ్ చేస్తున్నారు.

ఈ సమయంలో గుణశేఖర్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది.సమంత నటించిన శాకుంతలం సినిమా నుండి ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

ఇదే సమయంలో సినిమా విడుదల తేదీకి సంబంధించిన విషయం కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.మాకు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను వచ్చే దసరాకు విడుదల చేయబోతున్నారు.

దసరాకు పెద్ద సినిమాలు ఉన్నా కూడా ఈ సినిమాను భారీ ఎత్తున పాన్ ఇండియా లెవల్‌ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

సదరా లేదా దీపావళికి ఈ సినిమా పక్కాగా విడుదల అవుతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.సమంత ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కీలక పాత్రలో నటించడం వల్ల అంచనాలు మరింతగా ఉన్నాయి.

దర్శకుడు గుణశేఖర్‌ రుద్రమ దేవి తర్వాత చేసిన సినిమా ఇదే కావడం విశేషం.దిల్ రాజు ఈ సినిమాను గుణశేఖర్ తో కలిసి నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.

సమంత కు ఉన్న పాన్ ఇండియ క్రేజ్ ఈ సినిమా కు ఎంతగా ఉపయోగపడుతుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube