యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.ఒకప్పుడు కేవలం తెలుగు లోనే స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్ మార్కెట్ ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవల్ కు చేరుకుంది.
బాహుబలి 1, 2 లతో ప్రభాస్ దరిదాపుల్లో కూడా మరే హీరో రాలేనంత క్రేజ్ సంపాదించు కున్నాడు.దీంతో ప్రభాస్ లైనప్ ఇప్పుడు భారీ పాన్ ఇండియన్ సినిమాలతో నిండిపోయింది.
మరి ఈ ప్రాజెక్టుల్లో భారీ అంచనాలు ఉన్న పాన్ ఇండియన్ మూవీ ఏది అంటే ”సలార్”( Salaar ) అనే చెప్పాలి.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే భారీ హోప్స్ నెలకొన్నాయి.
మేకర్స్ క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిసిందే.మరి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.పాన్ ఇండియా ఆడియెన్స్ మొత్తం ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుండి మోస్ట్ ఏవైటెడ్ ట్రైలర్ కోసం అంత ఎదురు చూస్తుండగా ఇది అతి త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.డిసెంబర్ 1న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు కన్ఫర్మ్ చేసారు.
ఇదిలా ఉండగా తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.ఎన్నాళ్ళ నుండో ఈ సినిమా భారీ బిజినెస్ చేస్తుంది అనే వార్తలు వస్తూనే ఉన్నాయి.
అయితే తాజాగా ఏపీ డిస్టిబ్యూటర్స్ ఎవరో అఫిషియల్ గా తెలిపారు మేకర్స్.
ఏపీ డిస్టిబ్యూటర్స్ గురించి చెబుతూ.ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీ సిరి సాయి సినిమాస్, పశ్చిమ గోదావరిలో గీతా ఫిల్మ్స్, కృష్ణ, గుంటూరు రీజియన్లలో కెఎస్ఎన్ టెలిఫిలిమ్స్, తూర్పు గోదావరిలో లక్ష్మి నరసింహ శ్రీ మణికంఠ ఫిలిమ్స్, సీడెడ్ లో శిల్పకళా ఎంటర్టైన్ మెంట్స్ వారు, నెల్లూరులో శ్రీ వెంగమాంబ సినిమాస్ వారు రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా తెలిపారు.కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.
హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించగా డిసెంబర్ 22న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.