ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్టైలే వేరు.ఎన్ని తప్పులు చేసినా తన వర్గం అనుకున్నా.
తన అనుకున్న వాళ్లు అయినా ఆయన ఎంతైనా వెనకేసుకు వస్తారు.అదే తనకు పెద్దగా నచ్చని వాళ్లు అంటే వాళ్లు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా వాళ్లను అస్సలు చూడనట్టే ఉంటారు.
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విషయంలోనూ ఇప్పుడు చంద్రబాబు ఇదే వైఖరితో ఉన్నట్టు కనపడుతోంది.నాడు భూమా నాగిరెడ్డి మరణం తర్వాత సానుభూతిని క్యాష్ చేసుకునేందుకే ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు.
ఇప్పుడు ఆమె చాలా కష్టాల్లో ఉంది.కేసుల్లో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్లి వచ్చారు.
అమె భర్త అడ్రస్ లేదు.ఇంత కష్టాల్లో ఉంటే చంద్రబాబు కాని.
టీడీపీ నేతలు కాని ఆమె వైపే చూడడం లేదు.ఆమె గురించే మాట్లాడడం లేదు.
కనీసం బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత కూడా అఖిల ప్రియను పరామర్శించిన పాపాన పోలేదు.పైగా ప్రస్తుతం ఆమె గర్భవతి అని అంటున్నారు.ఇలాంటి సమయంలో కూడా జాలితో కూడా అఖిలప్రియను చంద్రబాబు పరామర్శించలేదు.ఆళ్లగడ్డలో మరో వర్గాన్ని ప్రోత్సహిస్తోన్న చంద్రబాబు అఖిలను పూర్తిగా పొమ్మనకుండానే ఇలా పొగ పెట్టేస్తున్నారా ? అఖిల విషయంలో బాబు అసలు స్వరూపం త్వరలోనే బట్ట బయలు కాబోతుందని స్థానికంగా పార్టీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో భూమా ఫ్యామిలీని ఆళ్లగడ్డ లేదా నంద్యాలలో ఒక నియోజకవర్గానికే పరిమితం చేస్తారని కూడా అంటున్నారు.

వాస్తవానికి అఖిల జైల్లో ఉండగానే బాబు సాయం కోసం ఆమె కుటుంబ సభ్యులు చంద్రబాబును కలిసినా.కనీసం వారికి బాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదట.ఇక అఖిల నేరుగానే బాబును కలుద్దామని అనుకున్నా … బాబు టైం ఇవ్వక వెనుదిరిగితే పరువు పోతుందని ఆమె సైలెంట్ అయిపోయారని అంటున్నారు.
ఇక అఖిల భర్త భార్గవ్ రామ్ ఆచూకీ ఇప్పటకీ తెలియలేదు.ఆయన బెయిల్ వచ్చాక కానీ లొంగే పరిస్థితి లేదంటున్నారు.
ఈ సాయం కోసమే అఖిల బాబును కలవాలని చూసినా బాబు పట్టించుకోలేదంటున్నారు.ఎన్నో పెద్ద పెద్ద కేసులకు క్షణంలో బెయిల్ తెప్పించే చంద్రబాబుకు అఖిల భర్తకు బెయిల్ తెప్పించడం పెద్ద కష్టం కాదు.
కానీ వాళ్లను పట్టించుకోవడం బాబుకు ఇష్టం లేనట్టే ఉంది.