అమెరికా అధ్యక్ష ఎన్నికలు..వారి గుట్టు బయటపెట్టిన మైక్రోసాఫ్ట్..!!!

నవంబర్ 3 న అమెరికాలో జరగనున్న అధ్యక్ష్య ఎన్నికలకి సర్వం సిద్దమవుతోంది.అధ్యక్ష అభ్యర్ధులు బిడెన్, ట్రంప్ ప్రచార పర్వంలో మునిగిపోయారు.

 Russia, China And Iran Hackers Target Trump And Biden Says Microsoft , Hackers,-TeluguStop.com

ఈ ఎన్నికల్లో గెలుపుకోసం ఇరు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా, చైనా, ఇరాన్ మూడు దేశాలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

రష్యా ట్రంప్ గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తుండగా, చైనా, ఇరాన్ లు మాత్రం ట్రంప్ ఓటమి కోసం వ్యూహాలు రచిస్తున్నాయి…ఇదిలాఉంటే అధ్యక్ష ఎన్నికల విషయంలో ఈ మూడు దేశాలు చేస్తున్న కుట్రని బయటపెట్టింది మైక్రోసాఫ్ట్.

అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేలా చైనా, రష్యా, ఇరాన్ లకు చెందిన హ్యాకర్లు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది.

అంతేకాదు ఇరు అధ్యక్షుల ఎన్నికల ప్రచారానికి సంభందించిన వ్యక్తులని ,సదరు వ్యక్తుల సంస్థల వెబ్ సైట్స్ ని హ్యాక్ చేశారని తెలిపింది.చైనా కి చెందిన జిర్కోనియం, ఇరాన్ కి చెందిన పాస్పరస్, రష్యాకి చెందిన స్త్రాంటియాన్ సంస్థలు హ్యాకింగ్ కి పాల్పడుతున్నట్టుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

గత ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ప్రచారాన్ని పక్కదారి పట్టించి రిపబ్లికన్ పార్టీ గెలుపుకోసం రష్యా హ్యాకర్లు సాయం చేశారని కుండబద్దలు కొట్టింది.

Telugu America, Cyberraiders, Russia-Telugu NRI

ప్రస్తుతం అమెరికా ఎన్నికలపై దృష్టి పెట్టిన ఈ హ్యాకర్స్ బృందాలు, బ్రిటన్ ఎన్నికలలో కూడా తమ ప్రభావాన్ని చూపించారని మైక్రోసాఫ్ట్ తెలిపింది.ఫ్యాన్సీ బార్ అనే పేరున్న స్ట్రాన్షియం సంస్థకు రష్యా సైనిక గూడచారి సంస్థతో సంభంధాలు ఉన్నాయని తెలిపింది.అయితే చాలావరకూ సైబర్ దాడులు చేస్తున్న సంస్థలు ప్రత్యర్ధులను మట్టికరిపించడంలో వైఫల్యం చెందాయని, రానున్న ఎన్నికల్లో అమెరికా ఎన్నికలపై వీరి ప్రభావం ఎలా ఉండబోతోందనే విషయం అంచనా వేయలేమని ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube