భారత విద్యార్థుల కోసం రష్యా సంచలన నిర్ణయం..వారికోసం ఏకంగా....

రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న నేపధ్యంలో కొన్ని రోజులుగా ఉక్రెయిన్ లో నెలకొన్న భీకర పరిస్థితులను అందరూ గమనిస్తూనే ఉన్నారు.ముఖ్యంగా భారతీయ విద్యార్థులు అక్కడ పడుతున్న ఆందోళన, ఆవేదన మాటల్లో చెప్పలేనిది.

 Russia Arranged 130 Buses To Evacuate Indians From Kharkiv Sumy, Russia, Indians-TeluguStop.com

భారత్‌ వచ్చేయమని అంటున్నా ఉక్రెయిన్ సైనికులు అడ్డుకోవడంతో దిక్కు తోచని స్తితిలో రైల్వే స్టేషన్ లలో ఉండిపోతున్న పరిస్థితి.తమ గోడు వెళ్ళగక్కుకుంటూ, కాపాడమని సామాజిక మాధ్యమాలలో వారు పెడుతున్న వీడియోలు అందరిని కదిలిస్తున్నాయి.

ఈ క్రమంలో

భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా విద్యార్ధులను ఇప్పటికే తరలించినా ఇంకా వేలాది మంది భారత విద్యార్ధులు ఉక్రెయిన్ లో పలు ప్రాంతాలలో చిక్కుకుని పోయారు.ఈ నేపధ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది.

భారతీయ విద్యార్ధులతో పాటు ఉక్రెయిన్ లో ఉన్న పలు దేశాల విద్యార్ధులను వారి వారి దేశాలకు తరలించేందుకుగాను 130 బస్సులను రంగంలోకి దించింది.ఉక్రెయిన్ నుంచీ ఖర్కీవ్, సుమీ నగరాల మీదుగా రష్యా చేరుకునే ఈ బస్సులు అక్కడి ఎయిర్ పోర్ట్ లలో విద్యార్ధులను దించుతుంది.

అక్కడ వారికి సదుపాయాలు అందించిన తరువాత వారు అక్కడి నుంచీ వారి వారి దేశాలకు వెళ్లిపోవచ్చు.ఇదిలాఉంటే

రష్యా తీసుకున్న తాజా నిర్ణయంతో ఉక్రెయిన్ లోని విదేశీ విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.భారత్‌ ఇప్పటికే “ఆపరేషన్ గంగ” పేరుతో ఎంతో మంది భారత విద్యార్ధులను తరలించింది.కాగా నిన్న ఒక్కరోజే సుమారు 19 విమానాల ద్వారా దాదాపు 3726 వేల మంది విద్యార్ధులను భారత్‌ తీసుకువచ్చారు.

మరో రెండు రోజుల్లో 7 వేల మందిని ఉక్రెయిన్ నుంచీ భారత్‌ తీసుకురానున్నట్టుగా విమానశాఖమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

Russia Arranged 130 Buses To Evacuate Indians From Kharkiv Sumy

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube