పిల్లిని రక్షించినందుకు 10 లక్షల రివార్డ్.. ఎక్కడంటే !

మూగ జీవులు అంటే చాలా మంది ఇష్టపడతారు.వాటిని తమ పిల్లల కన్నా ఎక్కువుగా చూసుకుంటారు.

 Ruler Of Uae Gifts Rs 10 Lakhs To 4 Men Who Rescued A Cat, Ruler Of Uae Gifts Rs-TeluguStop.com

ఇంట్లో వాళ్లతో సమానంగా చూసుకుంటూ ప్రేమను పంచుతారు.ఈ మధ్య స్వచ్చంద సంస్థలు కూడా ముందుకు వచ్చి మూగ జీవులను సంరక్షిస్తున్నారు.

ఇలా మూగ జీవులంటే ఇష్టపడే వారు వాటిని సంరక్షిస్తూ వాటికీ ప్రేమను పంచుతూ ఉన్నారు.

తాజాగా ఒక దేశంలో పిల్లిని ప్రాణాలతో కాపాడారని వారికీ 10 లక్షల రివార్డ్ ఇచ్చింది.

పిల్లిని ప్రాణాలతో కాపాడి మానవత్వం చూపించారు.దీంతో వారిని ప్రశంసిస్తూ 10 లక్షల బహుమతిని ప్రకటించడంతో వారు కూడా సంతోష పడ్డారు.

ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఈ ఘటన దుబాయ్ లో జరిగింది.

అక్కడే నివసించే అబ్దుల్ రషీద్, నసీర్, ఆర్షఫ్, ఆతిఫ్ మహ్మద్ పనులు చేస్తూ అక్కడే నివసిస్తున్నారు.అయితే వీరు నివసించే దగ్గర ఒక పిల్లి ప్రమాదంలో పడితే ఆ పిల్లిని వీరు కాపాడారు.30 మీటర్ల ఎత్తు నుండి పడబోతున్న పిల్లిని చాకచక్యంగా కాపాడారు.ఒక పెద్ద దుప్పటి తీసుకు వచ్చి పిల్లి అందులో పడేలా చేయడంతో ఆ పిల్లి ప్రాణాలతో బయట పడింది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియో దుబాయ్ రాజు వరకు వెళ్లడంతో ఆయన కూడా ఈ ఘటనపై స్పదించారు.ఇలాంటి మూగ జీవులపై మానవత్వం చూపించడం చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉందని దుబాయ్ రాజు తెలిపాడు.

ఆ పిల్లిని కాపాడిన హీరోలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసారు.

ఆ పిల్లిని క్షేమంగా కాపాడినందుకు ఆ నలుగురికి ఆ రాజు భారత కరెన్సీ ప్రకారం 10 లక్షల రూపాయలను రివార్డ్ గా ప్రకటించి వారిని అభినందించారు దుబాయ్ రాజు.

ఈ వీడియో పై నెటిజెన్స్ కూడా స్పదింస్తున్నారు.వారి మానవత్వానికి మంచి మనసుకు ప్రశంసలు అందుతున్నాయి.ఈ పిల్లిని కాపాడిన వారిలో ఆష్రఫ్ మన దేశానికీ చెందిన కేరళ రాష్ట్రం వాడు కావడం ఇక్కడ విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube