ఎన్టీఆర్ పై పేర్ని నాని సింపతీ ఆర్ఆర్ఆర్ కు ప్లస్ కానుందా.. లాజిక్ తో దెబ్బ కొట్టారుగా?

తాజాగా మంత్రి పేర్ని నాని జూనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి ప్రస్తావించారు.టిడిపి వాళ్ళు ఎప్పుడు ఆయన సినిమాలకు ట్వీట్ వేయలేదే అంటూ ప్రశ్నిస్తూ.

 Rrr Will Get Free Publicity With Minister Nani Comments , Minister Nani , Jr Ntr-TeluguStop.com

ఎన్టీఆర్ ఫై సింపతీ చూపించారు.ఇక మంత్రి నాని చూపించిన సింపతి ఎన్టీఆర్ కు, ఆర్ఆర్ఆర్ కు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో టి.డి.పి వాళ్లు కూడా హడావిడి చేయాల్సిన పరిస్థితులు కల్పించారు మంత్రి నాని.అంతేకాకుండా భీమ్లా నాయక్ సినిమాకు చేసిన హడావిడి చేయకపోతే ఎన్టీఆర్ ను చంద్రబాబు తొక్కేయాలని చూస్తున్నట్టే లెక్క.

అలా ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్ లైమ్ లైట్ లోకి వచ్చారు.

తాజాగా భీమ్లా నాయక్ సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల రోజే మంత్రి నాని ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రస్తావించారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఒక్కడే గొప్ప హీరో కాదని, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదని ఈ విషయంలో టీడీపీ చాలా అతి చేస్తోంది అని తెలిపారు నాని.

తొక్కేయడం అంటే చంద్రబాబు హరికృష్ణ ను రాజకీయాల్లో తొక్కేసినట్టా అంటూ ప్రశ్నించారు నాని.లేక ఎన్టీఆర్ ని వాడుకొని వదిలేసినట్టా అని పరోక్షంగా ఎన్టీఆర్ అభిమానుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు నాని.

తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో అంత హడావిడి చేసిన చంద్రబాబు, లోకేష్ గతంలో ఎప్పుడైనా ఎన్టీఆర్ సినిమాకు ఆ విధంగా చేశారా అని ప్రశ్నించగా అభిమానులు ఆలోచనలో పడ్డారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణ సినిమాలను సపోర్ట్ చేసే పెదబాబు, చినబాబు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఎందుకు పట్టించుకోరు అన్న లాజిక్ ప్రేక్షకుల మదిలో మెదిలింది.ఇకపోతే ఇప్పటికే కుప్పంలో జూనియర్ జెండా ఎగిరేసరికి టీడీపీ నాయకులు గజగజ వణుకుతున్నారు.ఇక తాజాగా మంత్రి నాని వ్యాఖ్యలతో జూనియర్ అభిమానులు నిజంగానే కళ్లు తెరుచుకుంటే, టీడీపీ సపోర్ట్ ఎవరికో వారు అర్థం చేసుకోగలిగితే చంద్రబాబుకి తీవ్ర నష్టం.

దాన్ని కవర్ చేసుకోవాలంటే రేపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ రోజు టీడీపీ ఆ సినిమాకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి.

Rrr Will Get Free Publicity With Minister Nani Comments

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube