దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులంతా గత ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.
కానీ ఇప్పటి వరకు కరోనా అడ్డంకిగా మారడంతో ఈ సినిమా రోజురోజుకూ వాయిదా పడుతూనే వస్తుంది.ఎట్టకేలకు ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అత్యంత భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది ఆర్ ఆర్ ఆర్ సినిమా.
ఈ సినిమా రిలీజ్ తర్వాత సోషల్ మీడియా అంతటా సందడి నెలకొంది.
సోషల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ మ్యానియా చూస్తుంటే జక్కన్న టీమ్ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నట్టే కనిపిస్తుంది.ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు, ఇక్కడ బెనిఫిట్ షోలు వీక్షించిన వారు ఈ సినిమాపై పొగడ్తలు కురిపిస్తున్నారు.
ఈ సినిమా మ్యానియా అంతటా స్టార్ట్ అయినట్టే కనిపిస్తుంది.
ఈ సినిమా ప్రీమియర్ షోలకు అద్భుతమైన రివ్యూలు వస్తున్నాయి.
ఈ రోజు తెల్లవారు జామున హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం, సన్నిహితుల కోసం ప్రత్యేక షో ప్రదర్శించారు.

జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన భార్య లక్ష్మి ప్రణతి, పిల్లలు నందమూరి భార్గవ్ రామ్ లతో పాటు ప్రివ్యూ కి చిరంజీవి కూడా హాజరయ్యారు.

ఈ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ రియాక్షన్ ఏం ఇచ్చాడా అని అంతా అనుకుంటూనే ఉంటారు.అయితే నందమూరి అభిమానులు ఖుషీ అయ్యేలా సినిమా చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఇచ్చాడు.ఈ సినిమా చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వక చిరునవ్వుతో బయటకు వచ్చాడు.అలాగే మీడియాకు థమ్స్ అప్ కూడా చూపించడం చూసి ఈయనకు ఈ సినిమా ఫుల్ హ్యాపీ గా అనిపించింది అని తెలుస్తుంది.