Rogue Movie Review

చిత్రం : రోగ్

 Rogue Movie Review-TeluguStop.com

బ్యానర్ : తాన్వీ ఫిలిమ్స్

దర్శకత్వం : పూరి జగన్నాథ్

నిర్మాతలు : సీఆర్ మనోహర్, సీఆర్ గోపి

సంగీతం : సునీల్ కశ్యప్

విడుదల తేది : మార్చి 31, 2017

నటీ-నటులు – ఇషాన్, మన్నారా చోప్రా, ఎంజెలా ఠాకూర్ అనూప్ సింగ్ తదితరులు

గత కొంతకాలంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్.ఈమధ్య హిట్ లేని పూరి జగన్నాథ్ భుజాల మీద ఇషాన్ ని పరిచయం చేసే బరువు పడింది.

మరీ ఈ బరువు (రోగ్) ని పూరి మోయగలిగారా? పూరి సక్సెస్ రేట్ ఈ సినిమాతోనైనా మారుతుందా లేదా చూద్దాం.

కథలోకి వెళితే :

చెర్రి (ఇషాన్) పోలీసు కమీషనర్‌ చెల్లె అంజలి (ఎంజెలా)తో పీకల్లోతూ ప్రేమలో ఉంటాడు.కాని చెర్రిని మోసం చేసిన అంజలి మరో పోలిసుని (సుబ్బరాజు) పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడుతుంది.ఈ సందర్భంలో జరిగిన గొడవలో ఓ పోలీసు అధికారి కాళ్ళు విరిచేస్తాడు చెర్రి.

దాంతో అతడిని జైల్లో వేస్తారు.

అమ్మాయి మోసం చేసిందని ఆడజాతి మీద అసహ్యం పెంచుకోని జైలు నుంచి బయటకొచ్చిన చెర్రి తన వలన ప్రొఫెషనల్ లైఫ్ కోల్పోయిన ఆ పోలీసు కుటుంబాన్ని పోషించే బాధ్యత తన భుజాల మీద వేసుకుంటాడు.

అప్పుడే ఆ పోలిసు చెల్లి అంజలి (మన్నారా చోప్రా) పరిచయం అవుతుంది.

మొదటి అంజలితో పరిచయం హీరోని జైలుకి తీసుకెళ్తే, రెండొవ అంజలితో పరిచయం ఒక సైకో (ఠాకూర్ అనూప్ సింగ్) కలహం తీసుకోస్తుంది.

ఈ సైకో అంజలిని (మన్నారా) చంపడమే లక్ష్యంగా తిరుగుతుంటాడు.అసలు అంజలికి, ఆ సైకోకి అంజలికి మధ్య జరిగిన తగవు ఏంటి ? ఎందుకు చంపాలనుకుంటున్నాడు? చెర్రి తనని నిస్వార్థంగా ప్రేమించిన అమ్మాయి ప్రాణాలు కాపాడుకోగలిగాడా లేదా తెర మీదే చూడాలి.

నటీనటుల నటన :

ఇషాన్ లూక్స్ బాగున్నాయి.మంచి, ఎత్తు .రంగు.కాని మెప్పించే తొలిపరిచయం మాత్రం కాదు ఈ క్యారక్టర్.

ఫక్తు పూరి జగన్నాథ్ స్టయిల్లో కుళ్ళిపోయిన మరో పాత్ర తనది.అందంగా ఉన్నాడు అని చెప్పుకోవడం తప్పితే ఇంకేమి లేదు చెప్పుకోవడానికి.

తెలుగు వెర్షన్ లో తన పాత్రకి తాను డబ్బింగ్ చెప్పుకోలేదు కాబట్టి డైలాగ్ డెలివరీ బాగుందా లేదా కన్నడ వెర్షన్ చూసిన వారే చెప్పాలి.మన్నారా చోప్రా ఇటు గ్లామర్ పరంగానూ, అటు అభినయం పరంగాను ఆకట్టుకోలేకపోయింది.

తను ప్రియాంక చోప్రా, పరిణితి లాంటి టాలెంటెడ్ నటీమణులున్న కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయి అంటే ఇప్పటికి నమ్మాలనిపించదు.బాహుషా, తన ప్రతిభ కనబరిచే అవకాశం రాలేదేమో.

పూరి కనెక్ట్ నుంచి వచ్చిన ఎంజెలా బొమ్మలా ఉంది, హావభావాలు లేకుండా.

నటుడిగా ఈ సినిమాలో కొద్దోగొప్పో పాజిటివ్ మార్కులు కొట్టేసింది విలన్ ఠాకూర్ అనూప్ సింగ్ మాత్రమే.

ఫర్వాలేదనిపించే విలనిజంతో సైకో పాత్రని పోషించాడు.ఈ సినిమా ఇషాన్ కన్నా ఎక్కువ అనూప్ నే ఎక్కువ ప్రమోట్ చేయొచ్చు.

మిగితా పాత్రలు గుర్తుంచుకోదగ్గవి కావు.

టెక్నికల్ టీమ్ :

ముకేష్ సినిమాటోగ్రాఫి లో క్వాలిటి ఉన్నా , ఓవర్ గా అనిపించే క్రియేటివిటితో విసిగించినంత పని చేస్తుంది.జునైద్ కూర్పు చాలా ఔట్ డేటేడ్ గా ఉంది.దర్శకుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి తనని నిందించాలో లేదో.సునీల్ కశ్యప్ పాటలు బాగున్నాయి.విలన్ కోసం వాడిన సైకో సైకస్య అనే ట్రాక్ తప్పిస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు.

నిర్మాణ విలువలు బాగున్నాయి.ఇషాన్ ని హీరోగా నిలబెట్టేందుకు బాగా ఖర్చుపెట్టారు నిర్మాతలు మనోహర్, గోపి.

విశ్లేషణ :

సినిమాని చుట్టేస్తున్నాడు, పైత్యం చూపిస్తున్నాడు .కథ ఉండట్లేదు .ప్రతి సినిమాలో హీరో పాత్ర ఒకేలా ఉంటుంది.ఇవి పూరి జగన్నాథ్ మీద ఉన్న కంప్లయింట్స్.

ఇవి కేవలం ఆరోపణలు కావు, పచ్చి నిజాలు.రోగ్ తో అదే జరిగింది.

కథ ఏముంది అని పూరి జగన్నాథ్ ని అడగాలి అనిపిస్తుంది.ఎందుకు ప్రతీ సినిమాలో హీరో అదే పైత్యం చూపిస్తాడు? ఎందుకు ఒకే అగ్రెసివ్ మోడ్ లో ఉంటాడు? ఎందుకు హీరో ప్రతి సినిమా ఒకే డైలాగ్ మోడ్యూలేషన్ తో అరుస్తూ మాట్లాడతాడు? ఇలాంటి ప్రశ్నలెన్నో పూరి జగన్నాథ్ ని అడగాలి అనిపిస్తుంది.రోగ్ ఒక్క నిమిషం పాటు కూడా ఆసక్తికరంగా అనిపించదు.ఈ సినిమా చూసి పూరి వీరాభిమాని కూడా మహేష్, ఎన్టీఆర్ లాంటి అగ్రహీరోలు కూడా హిట్లు ఇచ్చిన పూరి ఎందుకు పక్కనపెడితున్నారో అర్థం చేసుకుంటాడు.

హీరో – విలన్ ఇద్దరు సైకోలే.కాని ఇక్కడ పిచ్చొళ్ళు వాళ్ళు కాదు, మొదటినుంచి చివరి దాకా థియేటర్లో కూర్చున్న జనాలు.ఎందుకంటే వారు ట్రైలర్ చూసిన తరువాత కూడా థియేటర్ కి వచ్చే సాహసం చేసారు కాబట్టి.కథ, కథనాలు లేవు కాబట్టి, ఈ సినిమా బాక్సాఫీస్ అవకాశాల గురించి మాట్లాడుకుంటే, మరీ నాటుగా ఉండే జనాలే తప్ప, సినిమాలో ఓ కథ చూద్దాం అనుకునే ఏ ప్రేక్షకుడిని మెప్పించాలన్నా కష్టమే.

పూరి ఫామ్ కంటిన్యూ అవుతోంది.

ప్లస్ పాయింట్స్ :

* పాటలు

మైనస్ పాయింట్స్ :

* పాటలు తప్ప మిగితావన్ని

చివరగా :

మరో చంటిగాడి ప్రేమకథ కాదు, పూరి పైత్యం నిండిన మరో సినిమా.

తెలుగుస్టాప్ రేటింగ్

1.5/5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube