ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.కేసును సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానంలో మృతుడి తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ప్రభుత్వం తరపు న్యాయవాదిపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను ఎందుకు నిందితురాలిగా చేర్చలేదని ప్రశ్నించింది.
అదేవిధంగా సీసీ ఫుటేజ్ లో ఉన్న వారిని ఎందుకు కేసులో చేర్చలేదన్న ధర్మాసనం కేవలం అనంతబాబును మాత్రమే చేర్చడం ఏంటని ప్రశ్నించింది.దీనిపై కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేదని, కేసును పోలీసులు నీరుగార్చేలా వ్యవహారించారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు అనంతబాబు కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది.