Super starKrishna passed away : కృష్ణ మృతికి కారణం ఏంటి?

కృష్ణ మృతికి కారణం ఏంటి?.ఇంట్లోనే స్రృహ తప్పి పడిపోయిన కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఎలా చనిపోయారు? సెప్టెంబరులో కృష్ణ సతీమణి ఇందిరా దేవి మృతి చెందిన సమయంలో.ఆయన బాగానే కనిపించారు.మరి అంతలోనే ఏమైంది? ఇప్పుడివే ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.దీనిపై కాంటినెంటల్ డాక్టర్లు స్పష్టతనిచ్చారు.మొదట కార్డియక్ అరెస్ట్‌తో ఆస్పత్రికి వచ్చారని.

 Reason For Krishna's Death , Krishna, Tollywood , Passed Away , Indira Devi, Mah-TeluguStop.com

ఆ తర్వాత అవయవాలన్నీ దెబ్బతిని మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల.కృష్ణ మరణించారని తెలిపారు.

మనశ్శాంతిగా వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో.చివరి క్షణాల్లో వైద్య చికిత్సతో ఇబ్బంది పెట్టలేదని వెల్లడించారు.

కృష్ణ నిన్న ఉదయం కార్డియక్ అరెస్ట్‌తో ఆస్పత్రికి వచ్చారని.ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించా మని స్పష్టం చేశారు డాక్టర్లు.వచ్చినప్పటి పరిస్థితి విషమంగానే ఉందని.క్రమక్రమంగా అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోయాయని తెలిపారు.

నాలుగు గంటల తర్వాత డయాలిసిస్ కూడా చేసీ.గంట గంటకూ కుటుంబ సభ్యలతో మాట్లాడారు డాక్టర్లు.సాయంత్రం తర్వాత అవయవాలన్నీ దెబ్బతిన్నాయని.బ్రెయిన్ డ్యామేజీ అయిందని తెలిపారు.రాత్రి 7 గంటల తర్వాత పరిస్థితి విషమించింది.చికిత్స కొనసాగించినా ఫలితం ఉండదని కుటుంబ సభ్యులకు వివరించారు.

చివరి క్షణాల్లో ఆయనకు ఇబ్బంది కలగకూడదని, ఉన్న కొన్ని గంటలు మనశ్శాంతిగా వెళ్లిపోవాలని అనుకొని.అందుకే తదుపరి చికిత్సను కొనసాగించలేదట డాక్టర్లు.ఉదయం 04:09కి ఆయన తుది శ్వాస విడిచారు.” అని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Telugu Chiranjeevi, Indira Devi, Krishna, Mahesh Babu, Pawan Kalyan, Ramesh Babu

ఇంట్లోనే స్పృహ తప్పారని తమకు తెలిసిందని కాంటినెంటల్ డాక్టర్లు తెలిపారు.ఐతే ఇంట్లో ఎంత సేపు అపస్మారక స్థితిలో ఉన్నారో తెలియదని.ఆస్పత్రికి వచ్చిన తర్వాత ఒక సెకన్ కూడా వృథా చేయకుండా ట్రీట్‌మెంట్ ఇచ్చామని పేర్కొన్నారు.సీపీఆర్ చేసి.మళ్లీ 20 నిమిషాల్లోనే గుండె కొట్టుకునేలా చేశామని వెల్లడించారు.కృష్ణ మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ , ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ , టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సంతాపం ప్రకటించారు.పలువురు ఆస్పత్రికి వెళ్లి మహేష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కృష్ణ మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.అభిమానులు కంటతడిపెట్టుకుంటున్నారు.

ఘట్టమనేని ఫ్యామిలీలో ఈ ఏడాది ఇది మూడో విషాదం.మొదట కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు, ఆ తర్వాత ఆయన భార్య ఇందిరా దేవి, ఇప్పుడు కృష్ణ మరణించడంతో.

మహేష్ బాబు కుటుంబం శోక సంద్రంలో మునిగింది.

Telugu Chiranjeevi, Indira Devi, Krishna, Mahesh Babu, Pawan Kalyan, Ramesh Babu

ఇక సూపర్ స్టార్ క్రిష్ణ మరణం పట్ల మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.మాటలకు అందని విషాదం ఇది.సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు.ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం.సాహసానికి వూపిరి, ధైర్యానికి పర్యాయపదం.ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం..

వీటి కలబోత కృష్ణ గారు.అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమ లోనే కాదు, భారత సినీపరిశ్రమ లోనే అరుదు.

తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ,అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ చేసుకొంటున్నాను.

అంటూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube