మన టాలీవుడ్ లో హీరోలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది.మన తెలుగు వారి అభిమానం ఎలా ఉంటుందో హీరోల ఫాలోయింగ్ చూస్తేనే తెలుస్తుంది.
ఒక్కసారి ఏ హీరోకు అయినా ఫ్యాన్ అయ్యారంటే వారిని ఎంతగా అభిమానిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు.ఇక హీరోల పుట్టిన రోజులను కూడా అట్టహాసంగా జరుపుతుంటారు.
వారి పుట్టిన రోజులకు కూడా అంతా హంగామా చెయ్యరు.కానీ తమ హీరో పుట్టిన రోజు అంటే మాత్రం ఒక నెల ముందు నుండే హంగామా స్టార్ట్ అవుతుంది.
మరి ఇప్పుడు తమ అభిమాన హీరోల కోసం ఫ్యాన్స్ చేస్తున్న హడావుడితో పాటు ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్ రెడీ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.ఈ మధ్య ఫ్యాన్స్ కోసం టాలీవుడ్ కొత్త ట్రెండ్ తెచ్చింది.
తమ అభిమాన హీరో కెరీర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచి పోయిన సినిమాలను వారి పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ వారి ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు.ఎప్పటి నుండో ఇలా చేస్తున్న ఇప్పుడు ఆ ట్రెండ్ మరింత ఎక్కువ అవుతుంది.
ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల పుట్టిన రోజులకు వారి క్లాసిక్ హిట్స్ ను మరోసారి ప్రదర్శించారు.ఇక ఇప్పుడు ప్రతీ హీరో పుట్టిన రోజుకు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.మరి ఈ జాబితాలో మాస్ రాజా రవితేజ కూడా ఉన్నారు.ఈయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.మరి అలాంటి సూపర్ హిట్ సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా అనుష్క శెట్టి నటించింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఇప్పటికి క్లాసిక్ హిట్ గా నిలిచి పోయింది.వచ్చే ఏడాది జనవరి 26న రవితేజ పుట్టిన రోజు కానుకగా విక్రమార్కుడు సినిమాను 4కే వర్షన్ లో రిలీజ్ చేయనున్నారట.
మరి జక్కన్న చెక్కిన ఈ సినిమా రీరిలీజ్ కూడా మంచి మాసివ్ రెస్పాన్స్ అందుకునే అవకాశం ఉంది.