హీరోయిన్ శ్రియా శరన్, హీరో తరుణ్ కలిసి నటించిన చిత్రం నువ్వే నువ్వే.ఈ సినిమా 2002 లో విడుదల అయింది.
ఈ సినిమా అప్పట్లో విడుదల బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.ఈ సినిమా విడుదల అయ్యి 20 ఏళ్లు పూర్తి అయింది.
కాగా ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.అంతేకాకుండా ఈ సినిమాతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ సినిమాను రవి కిషోర్ ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై నిర్మించారు.కాగా తాజాగా 2022 అక్టోబర్ 10 నాటికి ఈ సినిమా విడుదల అయ్యి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా ఏఎంబీ సినిమాస్లో తాజాగా ఒక స్పెషల్ సోను వేశారు.
ఈ స్పెషల్ షోకీ గాను చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.వనమాలి హౌస్ లో నువ్వే కావాలి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నిర్మాత రవి కిషోర్ గారు, నేను కలిసి పక్కన ఖాళీ స్థలంలో నడుస్తూ ఉన్నప్పుడు మాటల మధ్యలో కథను చెప్పాను.
రవి కిషోర్ గారు చెక్ బుక్ తీసి ఒక అమౌంట్ ఇచ్చారు.నువ్వే కావాలి సినిమాకు రైటర్ గా ఎంత అమౌంట్ అయితే ఇచ్చారో దాదాపు అంత అమౌంట్ ని అడ్వాన్స్ గా ఇచ్చారు.
నేను బైక్ కొనుకున్నాను అని చెప్పుకొచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్.నేను చెప్పిన కథను రవి కిషోర్ గారు ఎంతో బాగా నమ్మారు ఆయనకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను.

అంతేకాదు ఆయనకు ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా సరిపోదు అని తెలిపారు త్రివిక్రమ్.అంతే కాకుండా నువ్వే నువ్వే సినిమా కోసం ఢిల్లీకి వెళ్లి హీరోయిన్ శ్రియతో పాటు వాళ్ళ అమ్మకు కథ చెప్పడం నుంచి రిలీజ్ వరకు ప్రతి ఒక్క విషయము గుర్తు ఉంది అని తెలిపారు త్రివిక్రమ్.నువ్వే నువ్వే సినిమా షూటింగ్ సమయంలో ఫైట్ మాస్టర్ లేకపోతే హీరో తరుణ్ చేత త్రివిక్రమ్ ఒక కిక్కు కొట్టించే సీను చేశాడట.అయితే అప్పుడు తనలో వైలెన్స్ ఉంది అని తనకు అర్థమైందని చెప్పుకొచ్చారు త్రివిక్రమ్.
ఆ తర్వాత అతడు సినిమా ఎక్కించిన తర్వాత హీరో వెంకటేష్ త్రివిక్రమ్ ను నువ్వు చూస్తే సాఫ్ట్ గా ఉంటావు మరి సినిమా వైలెంట్ గా తీసావ్ అని అన్నారట.ఆ వయలెన్స్ తోనే నువ్వే నువ్వే సినిమాలో కిక్ తో స్టార్ట్ అయ్యింది అని చెప్పుకొచ్చారు త్రివిక్రమ్.
దర్శకుడిగా తనను పరిచయం చేసిన స్రవంతి రవికిశోర్ పాదాలకు త్రివిక్రమ్ నమస్కరించారు.







