మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని చిరుతో పాటు మెగా ఫ్యాన్స్ కు ఆతృతగా ఎదురు చూసారు.కానీ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి అందరి దసరా పండుగను మరింత సంతోషం అయ్యేలా చేసింది.
తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.ఇందులో చిరుతో పాటు చాలా మంది స్టార్స్ నటించారు.
డీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించగా.సత్యదేవ్ విలన్ పాత్రలో నటించాడు.
అలాగే సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమా కీలక రోల్ లో నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత అందరు సల్మాన్ ఖాన్ పాత్ర గురించి కామెంట్ చేసారు.
సల్మాన్ ఖాన్ రోల్ మాత్రం తెలుగు ఆడియెన్స్ ను అలరించలేక పోయింది అనే చెప్పాలి.ఇతడు కేవలం హిందీలో రిలీజ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగ పడ్డాడు కానీ ఎలాంటి ప్రభావం చూపించలేక పోయాడు.

ఇక ఏది ఏమైనా చిరు ఫ్రెండ్షిప్ కోసం సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు.
అందుకు ఎలాంటి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు.దీంతో ఈ సినిమా సూపర్ హిట్ అయినా సందర్భంగా చిరంజీవి సల్మాన్ ఖాన్ కు స్పెషల్ బహుమతి ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా హిట్ అయినా ఆనందంలో చిరు సల్మాన్ ఖాన్ కు ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వబోతున్నాడని దాని కోసం అంత సిద్ధం కూడా చేస్తున్నాడని తెలుస్తుంది.
దీంతో ఎంత ఖరీదైన కారు బహుమతిగా ఇస్తాడా అని అంతా ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు.







