వాటిని ఎప్పుడు తలకు ఎక్కించుకోకూడదు.. రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

నేషనల్ క్రష్  రష్మిక మందన్న( Rashmika Mandanna ) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అన్ని భాష చిత్రాలకు కమిట్ అవుతూ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఇక ఈమె చివరిగా యానిమల్(Animal )అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

 Rashmika Latest Comments Goes Viral About Stardom , Rashmika, National Crush, Pu-TeluguStop.com

ఇక ప్రస్తుతం ఈమె పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి స్టార్ డం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Animal, National Crush, Pushpa, Rashmika, Rashmikalatest-Movie

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ నాకంటే ఎంతో తెలివైన అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు.నాకంటే ఎంతో అద్భుతంగా నటించగలిగే అమ్మాయిలు అవకాశాల కోసం( Offers ) ఎదురు చూస్తూ ఉన్నారని తెలిపారు.అయితే వారు అక్కడ నేను ఇక్కడ ఉండటానికి కారణం కేవలం అదృష్టం అని మాత్రమే చెప్పాలి.ఆ అదృష్టం కారణంగానే నాకు సినిమాలలో అవకాశాలు వచ్చాయని తెలియజేశారు.

అప్పుడే నన్ను నేను నిరూపించుకోవాలనే ప్రయత్నం నాలో మొదలైంది.ఆ ప్రయత్నమే నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది.

Telugu Animal, National Crush, Pushpa, Rashmika, Rashmikalatest-Movie

ఈ విషయంలో నన్ను గుర్తించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలనీ తెలిపారు.ఇక మనం సినిమా రంగంలోనే కాదు ఏ రంగంలోకి వెళ్లిన జయపజయాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి.అయితే ఒకసారి విజయం వచ్చిందని ఆ విజయాన్ని ఎప్పుడూ కూడా తలకు ఎక్కించుకోకూడదని  ఈమె తెలిపారు.అలా చేస్తే కనుక ఆ ప్రభావం మన మనసుపై పడుతుందని తద్వారా ముందడుగు వేయలేము.

అది మన పతనానికి కారణం అవుతుంది అంటూ ఈ సందర్భంగా రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇక రష్మిక నటించిన పుష్ప 2 సినిమా( Pushpa ) ఆగస్టు 15వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube