ఏపీలో వారసత్వ రాజకీయాలకు ఎలాంటి కొదవ లేదు.ప్రతి నాయకుడు తమ వారసులని రాజకీయాల్లో ఓ రేంజ్‌లో చూడాలని అనుకుంటారు.
తమ వెనకే తిప్పుకుంటూ రాజకీయాలు నేర్పించి, భవిష్యత్‌లో ఎమ్మెల్యేనో, ఎంపీనో చేయాలని భావిస్తారు.అలా ఏపీలో ఉన్న వైసీపీ, టీడీపీల్లో ఉన్న చాలా నాయకులు చూస్తున్నారు.
ఇప్పటికే పలువురు నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చేశారు.
ఇందులో కొందరు సక్సెస్ అయితే, మరికొందరు ఫెయిల్ అయ్యి, సక్సెస్ అవ్వడానికి కష్టపడుతున్నారు.
అయితే ఏపీలో మరికొందరు వారసులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు.ఇప్పటికే పలువురు, తమ తండ్రులకు సాయంగా ఉంటూ రాజకీయం చేస్తూ, నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు.
అలా పోటీ చేయాలని చూసే వారసుల్లో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వారసుడు అప్పలనాయుడు కూడా ఉన్నారు.
బండారు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మామ అనే సంగతి తెలిసిందే.
ఇటు తండ్రి, అటు బావ ప్రోత్సాహంతో అప్పలనాయుడు రాజకీయం చేస్తున్నారు.ఇప్పటికే పెందుర్తి నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు.
స్థానిక సమస్యలపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు.అటు వైసీపీ ఎమ్మెల్యే అదీప్‌ని గట్టిగానే టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు.
తండ్రి ఇంటికి, మీడియా సమావేశాలకు పరిమితం కావడంతో, అప్పలనాయుడు నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నారు.
నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా పెందుర్తి నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో అప్పలనాయుడు, ఇప్పటినుంచే రూట్ సెట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ఒకవేళ చంద్రబాబు ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్ ఇస్తే బండారు పోటీ నుంచి తప్పుకుని తనయుడుకు టిక్కెట్ ఇప్పించుకోవచ్చని తెలుస్తోంది.మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో రామ్మోహన్ బామ్మర్ది పోటీలో ఉంటాడో లేదో.