దేవుడా.. చరణ్ భార్య ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

రామ్ చరణ్, ఉపాసన ( Upasana )సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉండటంతో పాటు సెలబ్రిటీ స్టేటస్ ను కలిగి ఉన్నారు.అటు చరణ్ కు, ఇటు ఉపాసనకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

 Ram Charan Wife Upasana Assets Value Details Here Goes Viral In Social Media, ,-TeluguStop.com

చరణ్, ఉపాసనలకు వేర్వేరుగా వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.అయితే వీళ్లిద్దరిలో ఎవరికి ఎక్కువగా ఆస్తులు ఉన్నాయనే ప్రశ్నకు చరణ్ కే ఎక్కువగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.

ఉపాసనను పెళ్లి చేసుకున్న తర్వాతే చరణ్( Ram charan ) కు కెరీర్ పరంగా కలిసొచ్చిందని చెప్పవచ్చు.ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో లక్ష్మీదేవి మెగా ఇంటికి వచ్చిందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఉపాసన గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.చరణ్ ఉపాసన ఉమ్మడి ఆస్తుల విలువ 2500 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.

ఈ ఆస్తులలో ఉపాసన ఆస్తుల విలువ 1130 కోట్ల రూపాయలు అని బోగట్టా.ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్( Apollo Hospitals ) మార్కెట్ విలువ 70,000 కోట్ల రూపాయలుగా ఉండగా రాబోయే రోజుల్లో ఉపాసన ఆస్తుల విలువ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.మెగా ప్రిన్సెస్ కు భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.చరణ్, ఉపాసన వివాదాలకు, నెగిటివిటీకి దూరంగా ఉన్నారు.

చరణ్ సినీ కెరీర్ పరంగా సత్తా చాటుతుండగా ఉపాసన పొలిటికల్ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.చరణ్, ఉపాసన జాతకం అనుకూలంగా ఉందని రాబోయే రోజుల్లో వాళ్లిద్దరికీ మరింత మంచి జరగాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సినిమా ఇండస్ట్రీతో మంచి సంబంధాలు ఉన్నా ఉపాసన మాత్రం సినిమా రంగానికి దూరంగా ఉంటున్నారు.భవిష్యత్తులో ఉపాసన నిర్మాతగా మారాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Ram Charan Wife Upasana Properties Value Upasana Assets

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube