Ram Charan : 16 ఏళ్ల చిరంజీవి కల నిజం చేసిన రామ్ చరణ్.. ఖుషి లో మెగా ఫ్యాన్స్..!!

మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) దాదాపు 16 ఏళ్ల క్రితం ఒక మాట చెప్పారు.అయితే ఆ మాటలు 16 ఏళ్ల తర్వాత తన కొడుకు రాంచరణ్ నిలబెట్టడంతో చాలామంది మెగా అభిమానులు ఖుష్ అవుతున్నారు.

 Ram Charan Made 16 Year Old Chiranjeevis Dream Come True-TeluguStop.com

మరి ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఆ మాట ఏంటి.రామ్ చరణ్ ( Ram Charan ) మెగాస్టార్ చిరంజీవి కల ఏం నెరవేర్చారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో మెగాస్టార్ గా మారారు.ఇక రామ్ చరణ్ తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ నటన లో మాత్రం తండ్రికి ఏమాత్రం తీసిపోకుండా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.

Telugu Chiranjeevi, Goa Festival, Magadheera, Ram Charan, Rrr, Sr Ntr, Vajrothsa

అంతే కాదు ఈయన గ్లోబల్ స్టార్ గా కూడా ఎదిగిన సంగతి మనకు తెలిసిందే.చిరుత తర్వాత రెండో సినిమా అయిన మగధీరతోనే( Magadheera ) రామ్ చరణ్ కి స్టార్ ఇమేజ్ వచ్చింది.అలా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ హీరోకి ఆర్ఆర్ఆర్ ( RRR ) సినిమాతో పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ వచ్చింది.ఇదంతా పక్కన పెడితే చిరంజీవి 16 సంవత్సరాల ముందు వజ్రోత్సవం వేడుకల్లో స్టేజ్ పై మాట్లాడుతూనే చాలా ఎమోషనల్ అయ్యారు.

Telugu Chiranjeevi, Goa Festival, Magadheera, Ram Charan, Rrr, Sr Ntr, Vajrothsa

గోవా ఫిలిం ఫెస్టివల్ ( Gao Film festival) లో ఏ ఒక్క తెలుగు నటుడి ఫోటో కూడా రాకపోవడం చాలా బాధాకరం.మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్,ఎస్వీఆర్ వంటి ఎంతోమంది గొప్ప గొప్ప నటులు ఉన్నారు.కానీ వాళ్ళేవ్వరి ఫోటోలు కూడా గోవా ఫిలిం ఫెస్టివల్లో కనిపించడం లేదు.అంతేకాదు మన తెలుగుజాతికి గోవా ఫిలిం ఫెస్టివల్ లో గౌరవం లభించడం లేదు అంటూ బాధతో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

అయితే 16 ఏళ్ల కిందట చిరంజీవి అన్న మాటల్ని ఈసారి చిరంజీవి కొడుకు రామ్ చరణ్ నిజం చేశారు.అదేంటంటే ఇప్పటివరకు చిరంజీవి ఏ విషయంలో అయితే బాధపడ్డారో ఆ విషయంలో రామ్ చరణ్ ( Ram Charan ) గెలిచి చూపించారు.

అదేంటంటే గోవా ఫిలిం ఫెస్టివల్ లో రామ్ చరణ్ ఫోటో కనిపించింది.దీంతో తండ్రి మాటలను కొడుకు నిజం చేశాడు అంటూ ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube