పౌరసత్వ బిల్లుకు రాజముద్ర

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెచ్చిన జాతీయ పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు ఇప్పటికే పార్లమెంటు ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే.ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు మరియు పలు పార్టీలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి.

 Rajamudra To The Citizenship Bill-TeluguStop.com

పలు చోట్ల అల్లర్లు చెలరేగుతున్నాయి.అయినా కూడా కేంద్రం తన పట్టుదల నిలుపుకుంది.

అనుకున్నట్లుగానే జాతీయ పౌరసత్వ చట్ట సవరణ బిల్లును తీసుకు వచ్చింది.పార్లమెంటులో ఆమోదం అయిన ఈ బిల్లు రాజ్యసభలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందా అని అంతా అనుకున్నారు.

నిన్న రాత్రి రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం జరిగింది.ఈ చట్ట సవరణ బిల్లుకు అనుకూలంగా 125 మంది ఓట్లు వేయగా వ్యతిరేకంగా 105 మంది ఓట్లు వేశారు.

రాజ్యసభలో శివసేన పార్టీ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.దాంతో ఈ విజయం సాధ్యం అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా కొన్ని పార్టీలు కూడా ద్వంద వైఖరి కారణంగా కేంద్రం ఈ బిల్లును తీసుకు వచ్చిందని ఈ సందర్బంగా ఎంఐఎం పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube