పౌరసత్వ బిల్లుకు రాజముద్ర
TeluguStop.com
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెచ్చిన జాతీయ పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు ఇప్పటికే పార్లమెంటు ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే.
ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు మరియు పలు పార్టీలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి.
పలు చోట్ల అల్లర్లు చెలరేగుతున్నాయి.అయినా కూడా కేంద్రం తన పట్టుదల నిలుపుకుంది.
అనుకున్నట్లుగానే జాతీయ పౌరసత్వ చట్ట సవరణ బిల్లును తీసుకు వచ్చింది.పార్లమెంటులో ఆమోదం అయిన ఈ బిల్లు రాజ్యసభలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందా అని అంతా అనుకున్నారు.
నిన్న రాత్రి రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం జరిగింది.ఈ చట్ట సవరణ బిల్లుకు అనుకూలంగా 125 మంది ఓట్లు వేయగా వ్యతిరేకంగా 105 మంది ఓట్లు వేశారు.
రాజ్యసభలో శివసేన పార్టీ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.దాంతో ఈ విజయం సాధ్యం అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా కొన్ని పార్టీలు కూడా ద్వంద వైఖరి కారణంగా కేంద్రం ఈ బిల్లును తీసుకు వచ్చిందని ఈ సందర్బంగా ఎంఐఎం పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ వస్తుందా.. ఈ కాంబోలో సీక్వెల్ వస్తే హిట్ అంటూ?