ప్రముఖ ఈ కామర్స్ షాపింగ్ పోర్టల్ అమోజాన్తన వినియోగదారులకు మరో సారి శుభవార్త చెప్పింది.మరో మారు సేల్ ను తమ వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది.
ఈ సేల్ కు అమోజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ అనే పేరును కూడా నిర్ణయించింది.ఈ సేల్ రేపటి నుంచి ప్రారంభమై ఈ నెల 9వ తేదీ దాకా కొనసాగనుంది.ఈ సేల్ లో భాగంగా సంస్థ తమ కస్టమర్లకు పలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.25 వేల కన్నా తక్కువ ధరలో ఉండే స్మార్ట్ ఫోన్లు కొనాలని భావించే వారికి ఈ సేల్ అద్భుత అవకాశం అని నిపుణులు సూచిస్తున్నారు.ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్ల మీద దిమ్మతిరిగే రేంజ్ లో దాదాపు 40 శాతం తక్కువ ధరకు ఫోన్లు లభించనున్నాయి.
అంతే కాకుండా ఎస్బీఐ లాంటి బ్యాంకుల కార్డులు వాడితే ఇంకా ఎక్కువగా అదనపు డిస్కౌంట్లు లభించనున్నాయి.
మరో విషయమేంటంటే ఒక వేళ పాత ఫోన్లను ఎక్స్ చేంజ్ ఆఫర్లో ఇచ్చి కొత్త ఫోన్లు కొనాలనుకునే వారికి కూడా అదనపు డిస్కౌంట్లను అమోజాన్ అందిచనుంది.ఇక ఈ సేల్ లో రెడ్ మీ సంస్థకు చెందిన నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫోన్ అత్యంత తక్కువ ధరలో లభించనుంది.
ఈ ఫోన్ పై మాత్రం అదిరిపోయే డిస్కౌంట్ ఉండనుందని అందరూ అంటున్నారు.
కానీ ఈ ఫోన్ మీద ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చే దానిని కంపెనీ ఇంత వరకు ప్రకటించకపోవడం గమనార్హం.ఆండ్రాయిడ్ ఫోన్లలో అగ్రస్థానంలో ఉన్న సామ్ సంగ్ కంపెనీ నుంచి వచ్చిన గెలాక్సీ M 42 ఫోన్ కు అదిరిపోయే డిస్కౌంట్ ను అమోజాన్ అందిచనుంది.ఇక మరో కంపెనీ ఒప్పో కు చెందిన స్మార్ట్ ఫోన్ F19 ఫోన్ పై కూడా భారీగా నే డిస్కౌంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది.