తెలుగు సినీ నటుడు రామ్ పోతినేని.దేవదాసు సినిమా ద్వారా తొలిసారిగా హీరోగా పరిచయమైన రామ్.ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ప్రతి ఒక్క సినిమా రామ్ కు మంచి విజయాన్ని సాధించినవే.ఆయన నటనకు ఫిలింఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు రామ్.ఇదిలా ఉంటే 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ లో రామ్ పాత్ర ఎంతగానో ఆకట్టుకోగా మంచి విజయాన్ని అందించింది.
ఇదిలా ఉంటే రామ్ మరో సినిమాలో చేయనుండగా.ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరో కాదు.
ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్.ఈయన దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.ఆయన నిర్మాతగా, రచయితగా కూడా మంచి పేరు పొందాడు.తొలిసారిగా పోకిరి సినిమాతో తన దర్శకత్వంను పరిచయం చేయగా.
ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.ఇక ఆ తర్వాత పూరి వెనుకకు తిరగకుండా తన కెరీర్లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు.
అంతే కాకుండా అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే రామ్ ఇప్పుడు నటించే సినిమా పాన్ ఇండియా సినిమా.ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలకే ఆసక్తి చూపగా.హీరో రామ్ కూడా అదే బాటలో నడవనున్నాడు.
ఇదిలా ఉంటే పూరి తో కలిసి ఇస్మార్ట్ శంకర్ లో చేయగా.మరోసారి పాన్ ఇండియా సినిమాను పూరి తోనే చేయనున్నాడట.
ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నాడు.ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా లో బిజీగా ఉన్నాడు.
కాగా ఈ సినిమా తర్వాత వెంటనే రామ్ తో కలిసి పాన్ ఇండియా సినిమాను చేయనున్నాడు.