లైగర్ సినిమా పరాజయం ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనంగా మారింది.పాన్ ఇండియాగా విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని అంతా భావించగా ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ అవ్వడంతో అందరికీ గట్టి షాక్ ఇచ్చింది.
ఈ సినిమా వల్ల విజయ్ దేవరకొండ మాత్రమే కాదు పూరీ జగన్నాథ్ కూడా తీవ్రంగా నష్టపోయే విధంగా సూచనలు కనిపిస్తున్నాయి.విజయ్ దేవరకొండకు ఈ సినిమా నే కాకుండా ప్రస్తుతం సమంత నటిస్తున్న సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
అలాగే పూరి జగన్నాథ్ తో జనగణమన అనే మరో సినిమాకు కూడా సంతకం చేశాడు విజయ్.
సినిమా విజయంతో సంబంధం లేకుండానే విజయ్ పూరీలు లైగర్ సినిమా పూర్తి కాకముందే జనగణమన సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు.
వాస్తవానికి జనగణమన సినిమా మహేష్ బాబు కోసం రాసుకోగా అందుకు మహేష్ బాబు సిద్ధం గా లేడు.దాంతో ఈ సినిమాని పాన్ ఇండియా చిత్రంగా విజయ్ దేవరకొండ తోనే తీయాలని నిర్ణయించుకున్నాడు పూరి.
ఇక లైగర్ సినిమా పరాజయం పాలవడంతో పూరీతో జనగణమన సినిమా తీయాలనే ఆలోచన నుంచి తప్పుకుంటున్నట్టు గా తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట విజయ్ దేవరకొండ.దీంతో పూరి జగన్నాథ్ కు గట్టి షాక్ తగిలిందని భావించవచ్చు.
అంతేకాదు ఇదివరకే టెంపర్ సినిమాకి ముందు వరుస పరాజయాలను ఎదుర్కొన్న పూరి ఆ తర్వాత సైతం అనేక అపజయాలను చూశాడు.
ఇస్మార్ట్ శంకర్ సినిమా తో లైన్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ ఇప్పుడు మళ్ళీ పరాజయాన్ని ఎదుర్కోవడం ఆయన అభిమానులను ఒకింత షాక్ కి గురి చేసింది.ఓవైపు లైగర్ పరాజయం మరోవైపు జనగణమన సినిమాకు బ్రేక్ పడటంతో పూరి జగన్నాథ్ కు రెండు విషయాల్లో చుక్కెదురైంది.ఇక ప్రీమియర్ షో నుంచే నెగటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో అటు యు.ఎస్ మార్కెట్ సైతం నెగిటివ్ టాక్ తో నడుస్తోంది.మరోవైపు విజయ్ దేవరకొండ అభిమానులు సైతం సినిమాని ఘోరంగా దుమ్మెత్తి పోస్తూ ఉండడం మరింత కలవరపెట్టే విషయం అని చెప్పుకోవచ్చు.
ఇక విజయ్ దేవరకొండ కెరీర్ లోనే పరమ చెత్త సినిమా గా లైగర్ మిగిలిపోవడం ఖాయం గా కనిపిస్తోంది.