మరో కొద్ది గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ ఎల్వీ సీ 46  

Pslv C46 Is Ready To Go To Skyhigh-pslv C46 Lounching Date,pslv C46 Updates,telugu Viral News,viral In Social Media

ఏపీ లోని నెల్లూరు జిల్లా అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ ఎల్వీ) సి 46 ప్రయోగానికి సిద్ధమౌతోంది. మరో కొద్దీ గంటల్లో అది నింగిలోకి ఎగరనుంది. ఈ వెహికల్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఈ రోజు ఉదయం 4:30 నుంచి ప్రారంభమైంది. ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ నిర్విరామంగా 25 గంటలు కొనసాగి అనంతరం రేపు ఉదయం 5.30 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది..

మరో కొద్ది గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ ఎల్వీ సీ 46 -PSLV C46 Is Ready To Go To Skyhigh

615కిలోల బరువున్న ఈ శాటిలైట్ కాలపరిమితి 5 సంవత్సరాలు. అయితే ఈ శాటిలైట్ సాయం తో రీశాట్‌-2బీర్‌1 ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి మోసుకెళ్లనుంది. రేపు ఉదయం 5:30 నిమిషాలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడానికి శాస్త్రవేత్తలు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నో రాకెట్ లను విజయవంతంగా నింగిలోకి పంపిన షార్ ఈ ప్రయోగం కూడా విజయవంతం అవుతుంది అని షార్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.