గత ఏడాది 2022, మార్చి 25న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ హిట్ అందుకున్న పాన్ ఇండియన్ మూవీ ”రౌద్రం రణం రుధిరం”.( RRR ) ఈ సినిమా గురించి తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.
హాలీవుడ్ లెవల్లో ఎందరో దర్శకులు సైతం ఈ సినిమాకు ఫిదా అయ్యారు.ఇటీవలే ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకుని మరో సంచలనం క్రియేట్ చేసింది.
ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీను మన డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడం మన తెలుగు వారికీ గర్వకారణం.స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ సినిమాతో ఈ స్టార్ హీరోలు కూడా గ్లోబల్ వైడ్ గా పేరు సంపాదించు కున్నారు.
ఇక గ్లోబల్ వైడ్ గా రామ్ చరణ్( Ram Charan ) మరింత ఫేమ్ అయ్యాడు.
దీంతో గ్లోబల్ మీడియా వారు చరణ్ కు ఆసక్తికర ట్యాగ్ లు కూడా పెట్టారు.ఆస్కార్ కు ముందు చరణ్ హాలీవుడ్ మీడియా వెళ్లగా ఇండియన్ సినిమాకు బ్రాడ్ పిట్ అంటూ ఈయనపై ప్రశంసలు కురిపించి హాలీవుడ్ స్టార్ హీరోతో పోల్చి చెప్పారు.ఇక ఇదే విషయాన్నీ చరణ్ కో స్టార్ గా నటించిన ప్రియాంక చోప్రాను( Priyanka Chopra ) అడిగారు.
ప్రియాంక చోప్రా ఇండియన్ హీరోయిన్ మాత్రమే కాదు హాలీవుడ్ కు వెళ్లి అక్కడ సెటిల్ అయ్యి హాలీవుడ్ సెలెబ్రిటీ అయిపోయింది.ఆ తర్వాత అక్కడ హీరో అయిన నిక్ జోన్స్ నే పెళ్లి చేసుకుంది.ఈమె చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.చరణ్ ను ఇండియాస్ బ్రాడ్ పిట్ అంటే ఒప్పుకుంటారా అని అడుగగా నాకు బ్రాడ్ పిట్ కోసం తెలీదు బట్ చరణ్ కు మంచి చరిష్మా ఉందని.
రామ్ ఈజ్ వెరీ నైస్ అంటూ కితాబు ఇచ్చేసింది.దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.