మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా త్రివిక్రమ్( Trivikram ) దర్శకత్వం లో నటిస్తున్న ‘గుంటూరు కారం’( Guntur Karam ) సినిమాలో మీనాక్షి చౌదరిని( Meenakshi Chowdary ) పూజా హెగ్డే స్థానంలో తీసుకుంటున్నారన్న సంగతి తెలిసిందే.అఫీషియల్‌గా చెప్పడమే ఆలస్యం.
అయితే తాజాగా షెడ్యూల్లో మీనాక్షి సైలెంట్‌గా చిత్రీకరణలో పాల్గొందని ప్రచారం జరుగుతోంది.ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.
ఇదిలా ఉంటే, త్రివిక్రమ్ సినిమాలో మీనాక్షి చౌదరికి లక్కీ ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు, మహేష్ లాంటి స్టార్ హీరో తో సినిమా చేయడం ఆమెకు నిజంగా పెద్ద విషయమే…
మీనాక్షి చౌదరి నటించిన మొదటి సినిమా “ఇచట వాహనములు నిలుపరాదు” ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా త్రివిక్రమ్ వచ్చారు.హీరో సుశాంత్ అల వైకుంఠపురంలో నటించడంతో త్రివిక్రమ్ ఈ సినిమా ప్రమోషన్ కి రావడం జరిగింది.
అయితే ఆ ఈవెంట్ లో మీనాక్షి చౌదరిని పొగుడుతూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాదు ఆమెకు అవకాశం ఇస్తానంటూ గురూజీ మీనాక్షి కి చెప్పడం జరిగింది…
ఇప్పుడు ఆ వీడియోను వైరల్ చేస్తూ త్రివిక్రమ్ ఆమెకు ఛాన్స్ ఇస్తున్నాడు అని ఫ్యాన్స్ చెప్తున్నారు.మహేష్ సినిమాలో ఛాన్సు అంటే మీనాక్షి టాప్ ప్లేస్ లోకి వెళ్లడం ఖాయం అని చెప్పాలి.సుశాంత్ సినిమాతర్వాత రెండు హిట్ చిత్రాల్లో నటించిన మీనాక్షి సోషల్ మీడియాలో తీసిన ఫోటోలతో సోషల్ మీడియాలో మరింత ఫాలోవర్స్ ని సంపాదించుకుంది.
ఆమె క్యూట్ మరియు హాట్ లుక్స్ ప్రత్యేకంగా చేస్తాయి.స్టార్ హీరోకి సరిగ్గా సరిపోయే మీనాక్షి తన మచ్చలేని అందాలతో ఆకట్టుకుంది.మరి గుంటూరు కారం సినిమా తో మీనాక్షి ఫేట్ మారుతుందా అనేది చూడాలి…అయితే ఇప్పటికే త్రివిక్రమ్ చాలా మంది హీరోయిన్స్ ని టాప్ హీరోయిన్స్ గా మార్చాడు ఇక మీనాక్షి చౌదరి కూడా తొందర్లోనే టాప్ పొజిషన్ కి వెళ్ళబోతుందన్న మాట…