ప్రస్తుత రోజులలో చాలామంది అక్రమ రవాణాకు పాల్పడుతున్న సంఘటనలు మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము.అక్రమ రవాణా కోసం చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఆ ప్రయత్నాలలో కొంత మంది దొరికిపోతుంటే, మరికొందరు ఎటువంటి లోటు పాటలు లేకుండా రవాణాను చేస్తూ ఉంటారు.ఇకపోతే, అచ్చం అలాంటి సంఘటన ఒకటి బీహార్ లో చోటుచేసుకుంది.
మద్యం బాటిల్లను ఆయిల్ ట్యాంకర్( Oil tanker ) లో అక్రమ రవాణా చేస్తూ దొరికిపోయాడు ఒక ప్రముఖ వ్యాపారి.
సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.బీహార్ ( Bihar )లోని ముజఫర్‌పూర్ జాతీయ రహదారిపై ఒక ఆయిల్ ట్యాంకర్ చూసి అందరూ అవ్వకవుతున్నారు.దీంతో ఆయిల్ ట్యాంకర్ పై అనుమానం రావడంతో కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ట్యాంకర్ వద్దకు చేరుకొని పరిశీలన చేపట్టడంతో డ్రైవర్, వ్యాపారి ఇద్దరు కూడా వారి వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి అక్కడి నుంచి పరుగులు తీశారు.ఇక పోలీసులు ఇంతకీ ఆయిల్ ట్యాంకర్ లో ఏముందని పరిశీలన చేయగా.
అందులో ఆయిల్ కి బదులు దాదాపు 200 బీరు బాక్సులను గుర్తించారు.అలాగే దీనితో పాటు మద్యం బాటిళ్లు కూడా ఉన్నట్లు స్థానికులు పోలీసులు తెలియజేస్తున్నారు.
ఇక వాటిని వెంటనే సీజ్ చేసి, అక్రమ రవాణాకు పాల్పడిన వ్యాపారి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు.ఇక వాస్తవానికి ఈ మద్యం బాటిళ్లను అరుణాచల్ ప్రదేశ్ లో తయారైనట్లు తెలుస్తుంది.
వాస్తవానికి బీహార్లో మధ్యం అమ్మకాలు నిషేధించడంతో.కొందరు ఇలా అక్రమ మార్గాల ద్వారా మధ్య అన్ని తరలిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూసిన సోషల్ మీడియా ( Social media )వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇదేదో సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యారని కొందరు కామెంట్ చేస్తుంటే.మరికొందరేమో ఇది పెట్రోల్ ట్యాంకర్ లేక మందు ట్యాంకర అని కామెంట్ చేస్తున్నారు.