డ్రంకెన్ డ్రైవ్‌లో ప‌ట్టుకున్న పోలీసులు.. కోపంతో అత‌ను ఏం చేశాడంటే..?

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఎవరైనా సరే పట్టుబడడం కామన్.రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసమే పోలీసులు ఈ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను నిర్వహిస్తున్నారు.

 Police Caught On Drunken Drive What Did He Do In Anger Details, Drunken Drive, V-TeluguStop.com

ఈ తనిఖీల్లో పట్టుబడితే భారీగా ఫైన్లు కూడా వేస్తున్నారు.ఇలానే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడిన ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.

ఆ వ్యక్తి చేసిన పనిని తలుచుకొని పలువురు వామ్మో అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.ఇలా చేయడం సరైంది కాదని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.

ఇలా చేసినందుకు పోలీసులు మాత్రం అతడిపై న్యూసెన్స్ కేసు నమోదు చేశారు.బైక్నే కాల్చుకున్న వ్యక్తికి కోర్టు ఎటువంటి శిక్ష విధిస్తుందో.

ఎప్పుడూ చేసే తనిఖీలకన్నా న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు తనిఖీలు ఎక్కువగా చేశారు.ప్రయాణికుల భద్రత కోసమే ఈ తనిఖీలను పెంచినట్లు పోలీసులు చెబుతున్నారు.

అలా తనిఖీలు చేస్తున్న నాంపల్లి ట్రాఫిక్ పోలీసులకు సజ్జత్ అలీ ఖాన్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు.అతడు తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు.

దీంతో సజ్జత్ అలీ ఖాన్ పోలీసులను తీవ్రంగా బతిమలాడాడు.తనను వదిలి పెట్టమని ప్రాధేయపడ్డాడు.

Telugu Burnt Bike, Drunk Drive, Drunken Drive, Nampally, Sajjat Ali Khan, Meida-

ఇలా తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడడం తొలి సారని తనను క్షమించాలని కోరాడు.కానీ పోలీసులు మాత్రం ససేమిరా అన్నారు.దీంతో కోపానికి గురైన సజ్జత్ అలీ ఖాన్ తన బైక్ ను నిప్పు పెట్టి తగుల బెట్టాడు.ఈ ఘటనను చూసిన పోలీసులు షాక్ కు లోనయ్యారు.

కానీ తర్వాత తేరుకుని ఆ వ్యక్తి మీద సెక్షన్ 70 కింద కేసును నమోదు చేశారు.సైలెంట్ గా ఉంటే ఒక్క కేసుతోనే పోయేది కానీ సజ్జత్ అలీ ఖాన్ చేసిన పని వల్ల అదనంగా న్యూసెన్స్ కేసు కూడా నమోదయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube