PMV E-car: రూ.5 లక్షల కంటే తక్కువ ధరతో ఇండియాలో ఎలక్ట్రిక్ కారు లాంచ్..

ముంబైకి చెందిన కంపెనీ పీఎమ్‌వీ ఎలక్ట్రిక్ తన EaS-E ఎలక్ట్రిక్ వాహనాన్ని నవంబర్ 16న భారత మార్కెట్‌లో లాంచ్ చేయనుంది.ఈ మైక్రో ఈవీలో 5 డోర్స్‌ ఉంటాయి.

 Pmv Eas E Launched Cheapest Electric Car In India Market Details, Electric Car,-TeluguStop.com

డైలీ సిటీలో ట్రావెలింగ్ చేయడం కోసం తయారుచేసిన ఈ కారు 160కి.మీల రేంజ్ ఆఫర్ చేస్తుంది.

దీని బ్యాటరీని 3 kW AC ఛార్జర్‌తో నాలుగు గంటల కంటే తక్కువ వ్యవధిలో ఫుల్‌గా ఛార్జ్ చేయవచ్చు.రేంజ్‌ను బట్టి ఇది చిన్న బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.

దీనిలో క్రూయిజ్ కంట్రోల్, రీజెనరేటివ్ బ్రేకింగ్, ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, టెయిల్ ల్యాంప్స్, DRLలు, అల్లాయ్ వీల్స్ వంటివి ఇందులో ఉన్నాయి.ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్లు, ఏసీ, లైట్లు, కిటికీలు, హారన్‌లను రిమోట్‌గా కంట్రోల్ చేయడానికి మొబైల్ అప్లికేషన్ వంటి ఫీచర్లతో ఇది వస్తుంది.EaS-E ఎలక్ట్రిక్ వెహికల్‌ను రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేయవచ్చు.ఈ ఎలక్ట్రిక్ కారు 120 కి.మీ నుంచి 200 కి.మీ వరకు వేర్వేరు ఫుల్ ఛార్జ్ రేంజ్‌లతో మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Telugu Rupeeselectric, Afdableelectric, Cheapcost, Electric Car, India, Electric

ఈ కారు పొడవు 2,915 మిమీ వెడల్పు 1,157 మిమీ, ఎత్తు 1,600 మిమీ ఉంటుంది.దీని గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిమీ ఉంటుంది.లైట్ మోడల్‌గా ఉన్నందున, ఈ కారు కేవలం 550 కిలోల బరువు మాత్రమే ఉంటుందని సమాచారం.అంటే మామూలు కార్లతో పోలిస్తే దీని బరువు సగం కంటే తక్కువగా ఉంటుంది.

ఫ్యామిలీతో కలిసి చాలా తక్కువ ఖర్చులో ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈ కారు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube