Actress Prema Alitho Saradaga :హీరోయిన్ గా ఉండాల్సిన నేను ఇలా మారడానికి కారణం అదే.. నటి ప్రేమ వైరల్ కామెంట్స్!

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా ప్రేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో ప్రేమ ఎక్కువగా డివోషనల్ కు సంబంధించిన సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.

 Actress Prema Interesting Comments On Her Life In Ali Show Nov 15 , Actress Prem-TeluguStop.com

అంతేకాకుండా దేవతలు నిజంగానే ఇలా ఉంటారేమో అనే విధంగా ఆ పాత్రలలో అద్భుతంగా నటించేసింది ప్రేమ.అయితే అటువంటి దేవత పాత్రలు కేవలం ప్రేమకు మాత్రమే సొంతం అనే విధంగా గుర్తింపు తెచ్చుకుంది ప్రేమ.

ఇక అప్పట్లో గ్లామర్ పాత్రలను కూడా చేస్తూ భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది ప్రేమ.కాగా మొదట ప్రేమ విక్టరీ వెంకటేష్ నటించిన ధర్మచక్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

మొదటి సినిమాతోనే భారీగా క్రేజ్ ను ఏర్పరచుకున్న ప్రేమ ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.

ఇక ప్రేమ నటించిన సినిమాలో దేవి సినిమా సంచలన విజయం సాధించింది.

ఈ సినిమా తర్వాత ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రేమ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా సినిమాలలో నటిస్తోంది ప్రేమ.ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె ఆలీతో సరదాగా షోలో పాల్గొంది.

ఈ షోలో బాగా ఆమె ఎన్నో విషయాలను పంచుకుంది.సీనియర్ యాక్టర్ నరసింహరాజు తో కలిసి షోలో పాల్గొంది ప్రేమ.

సతీష్ హీరోయిన్గా ఉన్న తాను చిరుగాలి సినిమా తర్వాత సహాయనటిగా ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది ప్రేమ.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

చిరుగాలి సినిమా సమయం వరకు నేను హీరోయిన్ గా మంచి పొజిషన్లోనే ఉన్నాను.అయితే ఈ సినిమా కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చడంతో పాటు ఇందులో నా పాత్ర ఎమోషనల్ గా నాకు బాగా కనెక్ట్ అయింది.అందుకే ఈ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నాను.ఇందులో నా పాత్రను ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు.ఇందులో సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ పాట అంటే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం.ఆ పాటను సరిగ్గా వింటే ఈ పాటలో ఎంతో అర్థం కనిపిస్తుంది.

ఆ సినిమా తరువాత నుంచి సహాయ నటిగా మారిపోయాను అని చెప్పుకొచ్చింది ప్రేమ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube