వేములవాడ జనసభకు తండోపతండాలుగా ప్రజలు తరలిరావడంపట్ల మోదీ ఫిదా

రాజన్న సిరిసిల్ల జిల్లా ‘వేములవాడ జనసభ( Vemulawada Jana Sabha )’ పేరుతో ఎములాడ రాజన్న సన్నిధిలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.ఉదయం 10 గంటలకే బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చారు.సరిగ్గా 10.30 గంటలకు సభ ప్రాంగణానికి వచ్చిన మోదీ జన ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు.సభా ప్రాంగణం జనంతో కిక్కిరిపోగా… బయట నుండి ఇంకా జనం తరలివస్తూనే ఉన్న ద్రుశ్యాలను హెలికాప్టర్ ద్వారా తిలకించిన మోదీ జనసందోహాన్ని చూసి ఫిదా అయ్యారు.ఈ విషయాన్ని మోదీ ( PM Modi )మనుసులోనే దాచుకోకుండా బాహాటంగానే సభలో ప్రస్తావించారు.

 Pm Modi Emotional That Even Gujarat Has Not Seen Such Public Response, Pm Modi-TeluguStop.com

‘‘నేను ఎన్నో ఏళ్లపాటు గుజరాత్ లో 3సార్లు సీఎంగా పనిచేసిన.గుజరాత్ తో నా అనుబంధం మీకు తెలిసిందే.

అక్కడ ఎన్నో ఎన్నికలు చూసిన.కానీ గుజరాత్ లో కూడా పొద్దు పొద్దుగాళ ఇంత పెద్ద జనసందోహాన్ని నేను ఎన్నడూ చూడలేదు.కానీ ఇక్కడ ఇంతమంది జన సందోహం తరలిరావడం… సభ బయట కూడా భారీగా జనం వస్తున్న ద్రుశ్యాలను చూస్తుంటే… మీ అందరూ నాపట్ల చూపుతున్న ప్రేమాభినానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.’’అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కరీంనగర్ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్( Bandi Sanjay ) విజయం ముందే ఖాయమైందని చెప్పిన మోదీ కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద ఎవరో అభ్యర్ధిని బరిలో దించినా ఓటమి ఖాయమైందని చెప్పారు.ఇగ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ పూర్తిగా గల్లంతైందని పేర్కొన్నారు.

మరోవైపు సాక్షాత్తు ప్రధానమంత్రే దక్షిణ కాశీకి వచ్చి బండి సంజయ్ కు మద్దతు పలకడం ఒక ఎత్తయితే… సభకు తరలివచ్చిన జన సందోహంతో ఫిదా కావడంతో బీజేపీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేవు.మోదీ.మోదీ…బీజేపీ జిందాబాద్…బీజేపీ జిందాబాద్ అంటూ అడుగడుగునా నినాదాలు చేస్తూ సభ ఆద్యంతం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే ఉండటం గమనార్హం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube