ఆ విగ్రహాలతో కొంటెగా ఫొటోలు దిగిన వ్యక్తులు.. చూస్తే నవ్వాగదు..!

ప్రముఖ సిటీల్లో స్టాచ్యూలు ఎక్కువగా ప్రత్యక్షం అవుతుంటాయి.ముఖ్యంగా యూరప్ దేశాలు, అమెరికా, ఇంగ్లాండ్ తదితర ప్రాంతాల్లో అద్భుతమైన విగ్రహాలు కనిపిస్తాయి.

 People Who Landed Naughty Photos With Those Statues Statue, Viral Latest, News-TeluguStop.com

వీటిని చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వక తప్పదు.పర్యాటకులు ఎక్కువగా ఈ విగ్రహాలను చూస్తూ మైమర్చిపోతుంటారు.

అయితే కొందరు పర్యాటకులు మాత్రం ఈ విగ్రహాలతో ఫన్నీగా, నాటీగా ఫొటోలు దిగి నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నారు.ఈ ఫొటోలను తాజాగా ప్యూబిటీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

కాగా ఈ ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.వీటిలోని ఒక ఫొటోలో మీరు ఒక యువతి ఒక స్టాచ్యూ ముందు నిలబడి చెంపదెబ్బ తిన్నట్లుగా ఫోజు ఇవ్వటం చూడొచ్చు.

అయితే ఆ స్టాచ్యూ ఒక చేతిలో పూల బాస్కెట్ పట్టుకుని… మరొక చేతిని చెంపదెబ్బ కొట్టినట్లుగానే కనిపించింది.దీంతో ఈ మొత్తం ఫొటో ఆకట్టుకునేలా భలే కనిపించింది.

మరొక ఫొటోలో 2 స్టాచ్యూలు ఒక బల్లపై కూర్చున్నట్టు ఉన్నాయి.అయితే రెండు విగ్రహాల మధ్య కాస్త స్పేస్ ఉంది.అలాగే ఈ విగ్రహాలలోని ఒక విగ్రహం ఏదో చూస్తూ నవ్వుతున్నట్లుగా ఉంది.అయితే ఆ విగ్రహం తన ఫోన్‌ను చూస్తూ నవ్వుతున్నట్లుగా ఒక వ్యక్తి వాటి మధ్య కూర్చొని పోజు ఇచ్చాడు.

ఈ పోజు కూడా కరెక్ట్ గా సూట్ అయ్యింది.దీంతో ఆ స్టాచ్యూ నిజంగానే అతడి ఫోన్ చూసి నవ్వేస్తోందేమో అన్నట్లుగా ఫీల్ కలిగింది.

ఇంకొక ఫొటోలో మూడు విగ్రహాలు కార్మికులను పోలి ఉన్నాయి.ప్రతి విగ్రహం చేతిలో ఒక సుత్తి ఉంది.

అయితే ఆ సుత్తితో తననే కొడుతున్నట్టుగా ఒక యువకుడు పోజు ఇచ్చి అందర్నీ నవ్విస్తున్నాడు.

మరొక ఫొటోలో బాల్ హిట్ చేస్తున్న బేస్‌బాల్‌ ప్లేయర్ విగ్రహాన్ని చూడొచ్చు.అయితే ఈ విగ్రహం బాల్‌కి బదులుగా తననే కొట్టినట్టుగా ఒక వ్యక్తి ఒక పోజుతో భ్రమ కలిగించాడు.అలానే కూర్చున్న స్టాచ్యూకి టిష్యూ పేపర్ ఇవ్వడం, ఎలుగుబంటి స్టాచ్యూ చేతుల్లో యువతి పడుకోవడం, నీటి ఒడ్డున ఉన్న ఓ విగ్రహాని తన్నడం వంటి మరిన్ని ఫన్నీ ఫొటోలను కూడా ప్యూబిటీ షేర్ చేసింది.

ఈ ఫొటో పోస్ట్‌కి 3 లక్షల వరకు లైకులు వచ్చాయి.ఈ ఫోటోలు చాలా క్రియేటివ్ గా ఉన్నాయని వీటిని చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు మీరు కూడా వీటిపై ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube