రాజశేఖర్( Rajasekhar ) అంటేనే యాంగ్రీ యంగ్ మాన్ అనే విషయం అందరికీ తెలుసు ఆయన వరస పోలీస్ స్టోరీలతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేవాడు అంకురం వంటి ఒక బాక్స్ ఆఫీస్ హిట్ తర్వాత అతడికి మరొక యాంగ్రీ పోలీసు పాత్రలోనే సినిమా వస్తుందని అంతా ఊహించారు కానీ ఎవరి అంచనాలకు అందకుండా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లరి ప్రియుడు( Allari Priyudu ) వంటి ఒక రొమాంటిక్ సినిమాలో నటించే అవకాశం దక్కడంతో అందరూ షాక్ కి గురయ్యారు.రాజశేఖర్ తో సినిమా చేయాలనే ఆలోచన మొదటి నుంచి రాఘవేంద్రరావుకి ఉండేది దాంతో ఒకరోజు పిలిపించుకొని తన దగ్గర ఉన్న లవ్ స్టోరీ లో నటించాలని అడిగాడు అందుకు రాజశేఖర్ సైతం ఓకే చెప్పాడు.
కానీ సినిమాలో రొమాన్స్ పాటలు ఎక్కువగా ఉండడంతో తనలాంటి ఒక హీరోకి అవి సూట్ కావని రిస్క్ ఎందుకు తీసుకుంటారని కూడా రాఘవేంద్రరావుని రాజశేఖర్ ప్రశ్నించాడట నీకెందుకు సినిమా నేను తీస్తాను నువ్వు నటిస్తే చాలు నీకు ఇష్టమైతే నటించడం లేదంటే లేదు అని కరాకండిగా చెప్పారట కానీ రాఘవేంద్రరావు( Raghavendra Rao ) అంటేనే విజయానికి పర్యాయపదం కాబట్టి రాజశేఖర్ మరో మాట చెప్పకుండా నటించాడు.కానీ సినిమాలో నటిస్తున్నంత సేపు రాజశేఖర్ కి ఆ చిత్రం ఫ్లాప్ అవుతుందని గట్టిగా నమ్మకం ఉండేదట.తనని అన్ని పాటల్లో అంతవరకు ఎవరు చూపించలేదని నన్ను ఎవరు ఇంత సేపు చూడరు అంటూ తనలో తానే అనుకునేవాడట.
అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ చిత్రం 365 రోజులు ఆడింది మరోవైపు ఈ సినిమా విజయం సాధించాలని రాఘవేంద్రరావు సైతం విడుదల రోజు వరకు కూడా ప్రతిరోజు ప్రార్థించే వాడట ఎందుకంటే రాజశేఖర్ తో సినిమా ఏంటి అని తనను ఎంతో మంది భయపెట్టారట అతడికి హిట్ ఇచ్చి తీరాలని ఆరోజు ఆయన శపథం చేసుకొని ఆ సినిమా తీసి విజయం సాధించి రాజశేఖర్ కెరియర్ నీ టర్న్ చేశారు.సినిమా విడుదలైన తర్వాత కూడా అది యావరేజ్ చిత్రం గానే ఉంటుందని రాజశేఖర్ అనుకున్నారట.తన అభిప్రాయం పొరపాటు కావడంతో తనకు అంత పెద్ద విజయాన్ని అందించిన రాఘవేంద్రరావుకు మనస్పూర్తిగా కృతఙ్ఞతలు చెప్పాడట రాజశేఖర్.