జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై సరికొత్త ఆదేశాలు జారీ చేశారు.ఫిబ్రవరి 21 నుండి మళ్లీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా జరిగేలా.
కనీసం నియోజకవర్గానికి రెండు వేల మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకునేలా నాయకులు చూడాలని పిలుపు నిచ్చారు.పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతమవుతుందని మరింత బలోపేతం అయ్యేలా క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించాలని.
పేర్కొన్నారు.సభ్యత్వం తీసుకున్న వారికి భీమా సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు.
కరోనాతో చనిపోయిన 18 మందికి భీమ కల్పించామని కూడా పేర్కొన్నారు.2020 సెప్టెంబర్ మాసం నుండి క్రియాశీలక సభ్యత్వం ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది సభ్యత్వం తీసుకున్నారని గుర్తు చేశారు.ఈ క్రమంలో క్షేత్రస్థాయి పోరాటంలో కొన్ని ప్రమాదాలు సంభవించిన టైంలో ఇంకా అనేక పోరాటాలకు సంబంధించి పార్టీ కార్యకర్తలకు చుట్టుపక్కల ఉండే నాయకులు అండగా ఉన్నారని.సహాయం చేశారని పేర్కొన్నారు.
పరిస్థితి ఇలా ఉంటే ఈ నెల 21వ తారీకు నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం మళ్లీ ప్రారంభం అవుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు.చురుకుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగేలా చూడాలని పవన్ పిలుపునిచ్చారు.