క్లారిటీ కన్ఫ్యూజన్ మిక్స్ చేస్తున్న పవన్?

కనీస స్తాయిలో లో కూడా ఎంఎల్ఏ లు లేకపోయినా జనసేన లాంటి బలమైన ముద్ర వేస్తున్న పార్టీలు దేశ రాజకీయాల్లో అరుదనే చెప్పాలి.ఈ పరిస్తితి కి సినిమాలలో తిరుగులేని స్టార్ ఇమేజ్ గలిగిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లాంటి అధ్యక్షుడు ఉండడం ఒక కారణమైతే రెండు చోట్లా ఓడిపోయినా పట్టు వదలకుండా పార్టీని ముందుకు నడిపిస్తున్న వైనం మరో కారణం .

 Pawan Mixing Clarity Confusion, Pawan Kalyan , Janasena, Varahi Yatra , Tdp, Na-TeluguStop.com
Telugu Ap, Chandrababu, Janasena, Lokesh, Pawan Kalyan, Varahi Yatra-Telugu Poli

అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో సంఖ్యా పరంగా బలమైన సామాజిక వర్గాల్లో ఒకటి పూర్తిగా జనసేన( Janasena ) ను ఓన్ చేసుకున్న వైనంతో రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది.అయితే ప్రస్తుతం నడుస్తున్న సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా జనసేన ను పవన్ నడిపిస్తున్న విధానమే జనసేన ఉద్దాన పతనాలకు కారణం గా మారుతుంది .ముఖ్యంగా తన వారాహి యాత్ర( Varahi Yatra )ల తో జనసేన గ్రాఫ్ ను అమాంతం పెంచిన పవన్ ,తెలుగుదేశంతో పొత్తు ప్రకటనతో ఒక్కసారిగా ఆ వేడిని నీరు కార్చేసారనే చెప్పాలి.ముఖ్యంగా తెలుగుదేశంతో పొత్తు మెజారిటీ జనసైనికులు ఊహించినదే అయినప్పటికీ ఆ పొత్తును డీల్ చేసిన విధానం మెజారిటీ కార్యకర్తలకు అసంతృప్తినే కలిగించింది.

కారణం షరతులు లేని పొత్తులంటూ పవన్ తీసుకున్న స్టాండ్ అభిమానులకు అసలు నచ్చలేదు.అధికారంలో వాటా కోరుతున్నామని గాని లేదా ఇన్ని సీట్లకు పోటీ చేస్తున్నామని గానీ పవన్ ముందుగా ప్రకటించి అభిమానులను కార్యకర్తలను ఒప్పించి ఉండుంటే ఈరోజు జనసేన వేగం మరింత ఎక్కువగా ఉండేదని చెప్పవచ్చు.

Telugu Ap, Chandrababu, Janasena, Lokesh, Pawan Kalyan, Varahi Yatra-Telugu Poli

అయితే ప్రజా శ్రేయస్సు ముఖ్యం అంటూ పార్టీ అభివృద్ధి గురించి పవన్ సరిగా పట్టించుకోవట్లేదు అన్న అసంతృప్తి పార్టీ కోసం తమ విలువైన సమయాన్ని కేటాయిస్తున్న అభిమానులకు గట్టిగానే ఉందని చెప్పవచ్చు.ఏ రాజకీయ పార్టీ అయినా తాము ప్రజల కోసమే రాజకీయాలు చేస్తున్నామని చెబుతుంది.కానీ అదే సమయంలో పార్టీ ఎదుగుదలపై కూడా దృష్టి పేడుతుంది, కానీ పవన్ మాత్రం ప్రజా సంక్షేమమే తారక మంత్రం అంటున్నారు.రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారం అయితేనే ఆ పార్టీల మనుగడ ధీర్ఘకాలం ఉంటుంది .ఏదో ఒక దశలో అధికార సాదిస్తాం అని కానీ లేదా అధికారంలో వాటా పొందుతామనే నమ్మకం గాని లేకపోతే రాజకీయ పార్టీలు నిలబడలేవు .ఒక రాజకీయ పార్టీగా తాము లక్ష్యానికి ఎంత దూరం లో ఉన్నామో పవన్ కార్యకర్తలకు స్పష్టత ఇవ్వనంత వరకూ జనసేనలో ఈ అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుందని చెప్పవచ్చు.అధికారం పై ఆశ లేదని ఒకసారి, ముఖ్యమంత్రి పదవి వస్తే స్వీకరిస్తానంటూ మరోసారి ఇలా పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇస్తూ జనసేనా ని తన రాజకీయ లక్ష్యంపై కార్యకర్తలను మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నారనే చెప్పవచ్చు.నిజానికి ఈ తరహా ఆలోచనా విధానమే జనసేన లోకి కీలకమైన నాయకులను రాకుండా అడ్డుకుంటుందని మెజారిటీ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube