అవ‌స‌రానికి మించి ఆవేశం చూపిస్తున్న ప‌వ‌న్‌.. విమ‌ర్శ‌లు త‌ప్ప‌ట్లేదే..

రాజ‌కీయాల్లో ఎంత బ్యాలెన్సెడ్ గా ఉంటే అంత ఎత్తుకు ఎదుగుతారు.ఎవ‌రు రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా ఓపిక‌గా మాట్లాడిత‌నే వారికి ఎక్కువ కాలం మ‌నుగ‌డ ఉంటుంది.

 Pawan Kalyan Who Shows Rage Beyond What Is Necessary Criticisms Are Not Wrong ,p-TeluguStop.com

ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక‌పోతే ప్ర‌తిప‌క్షాల ట్రాక్‌లో ప‌డ్డ‌ట్టే.ఇప్ప‌టికే ఈ విష‌యంతో ఎంతోమంది ఆవేశానికి పోయి రాజ‌కీయ జీవితాన్ని నాశ‌నం చేసుకున్నారు.

అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఇలాగే అవ‌సరానికి మించి ఆవేశానికి గుర‌వుతున్నారు.ఈ మ‌ధ్య అధికంగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.

ప‌స లేని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ఆయ‌న రిపబ్లిక్ మూవీ ఆడియో ఫంక్ష‌న్ నుంచే త‌న ఫ్ర‌స్ట్రేష‌న్ చూపించేస్తున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే అభిమానుల‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.కాగా ప‌వ‌న్ మాట్లాడుతున్న‌ప్పుడు ఎవ‌రో ఒక అభిమాని స్టేజి మీద‌కు దూసుకురావ‌డం ఆయన కాళ్ల‌కు న‌మ‌స్క‌రించ‌డ‌మో లేదంటే ఆయ‌న‌తో ఒక సెల్ఫీ దిగ‌డ‌మో మ‌నం చాలా సార్లు చూస్తూనే ఉన్నాం.

ఇక మొన్న కూడా ఇదే విధంగా ఒక అభిమాని స్టేజ్ మీదకు వ‌చ్చాడు.కానీ ఎప్ప‌టి లాగా కాకుండా ప‌వ‌న్ ఈ సారి బ్యాలెన్సు మిస్ అయిపోయారు.

Telugu Ap, Cm Jagan, Janasena, Janasenani, Pawan Kalyan, Ysrcp-Telugu Political

ఆయ‌న‌పై గ‌ట్టిగా అరిచేశారు.దీంతో అంద‌రూ షాక్ అయిపోయారు.ప‌వ‌న్ నిజంగానే ఫ్ర‌స్ట్రేష‌న్‌లో ఉన్నాడ‌ని ప్ర‌చారం మొద‌లు పెట్టేశారు.ఇక రాజమండ్రి లో శ్రమదానం సంద‌ర్భంగా ప‌వ‌న్ అడ్డుకునేందుకు వ‌చ్చిన పోలీసుల‌పై కూడా ఇలాగే ఆవేశంతో ఊగిపోయారు.

పోలీసులు అని కూడా చూడ‌కుండా వారిపైకి పెద్ద గా అరవటం లాంటివి చేయ‌డంతో అంతా షాక్ అయిపోయారు.దీంతో ఆయ‌న‌పై అంద‌రూ విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టేస్తున్నారు.ప‌వ‌న్ స్థిమితం కోల్పోయార‌ని, అందుకే ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు.మ‌రోవైపు జ‌న‌సైనికులు కూడా ఇలాంటి మార్పు మంచిది కాదని, స‌హ‌జ‌త్వాన్ని కోల్పోతున్నారంటూ చెబుతున్నారంట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube