పవన్‌ ఆ మూడే.. మిగిలినవన్నీ పుకార్లేనట

పవన్‌ కళ్యాణ్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వరుసగా చిత్రాల్లో నటించబోతున్నాడని, ఈ నాలుగు సంవత్సరాల్లో కనీసం డజను సినిమాలు చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే మూడు సినిమాలకు కమిట్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌ మరో మూడు సినిమాలను కూడా లైన్‌లో పెట్టాడని, వాటికి ఇప్పటికే సైన్‌ కూడా చేశాడని వార్తలు వస్తున్నాయి.

 Latest Update Pawan Kalyan Another Three Movies, Pawan Kalyan, Vakeel Sahebh, Kr-TeluguStop.com

ఆ మూడు సినిమాల స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నాయని, వచ్చే ఏడాదిలో ఆ మూడు సినిమాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది.

పవన్‌ వరుసగా చిత్రాలకు కమిట్‌ అవుతున్నాడు అంటూ వస్తున్న వార్తలు నిజం కాదంటున్నారు.

మెగా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలు కాకుండా మరే సినిమాలకు కమిట్‌ కాలేదని ప్రకటించాడు.ఇప్పటి వరకు సినిమా వేరే ఏ సినిమాలకు సైన్‌ చేయలేదని అంటున్నారు.

హరీష్‌ శంకర్‌ సినిమా పూర్తి అయిన తర్వాత మళ్లీ పవన్‌ పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి పెడతాడనే వాదన వినిపిస్తుంది.

Telugu Harish Shankar, Pawan Kalyan, Pawankalyan, Tollywood, Vakeel Sahebh-Movie

పవన్‌ కళ్యాణ్‌కు సినిమాలంటే ఆసక్తి లేకున్నా కూడా ఆర్థిక అవసరాల కోసం సినిమాలు చేస్తున్నాడు.అంతే తప్ప సినిమాలు ఆయన చేయాలనుకోవడంలేదు అంటూ మెగా కాంపౌండ్‌ ప్రకటించింది.అందుకే ఈ మూడు సినిమాలు తప్ప పవన్‌ మరే సినిమాను కూడా చేయక పోవచ్చు అంటున్నారు.

ప్రస్తుతానికి అయితే ఆ మూడు సినిమాలే అని, ఈ మూడిటిని పూర్తి చేసిన తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుంటాడేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube