పోలీస్ అధికారికి కరోనా, స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన మంత్రి

మహారాష్ట్రాలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అందరికీ తెలిసిందే.ఇప్పటికే ఈ కరోనా రక్కసి అక్కడ 1,982 మందికి సోకగా, 150 మంది మృత్యువాత పడ్డారు.217 మంది ఈ వైరస్ నుంచి కోలుకొగా,మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే తాజాగా ఈ కరోనా మహమ్మారి కారణంగా ఆ రాష్ట్ర మంత్రి స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 Self Quarantine, Maharashtra Minister, Jitendra Ahwad, Lockdown-TeluguStop.com

మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జితేంద్ర అవ్ హాద్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది.ఇటీవల ఒక పోలీసు అధికారితో సన్నిహితంగా మెలిగిన మంత్రి గారు పోలీసు అధికారికి కరోనా సోకినట్లు తెలియడం తో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
మహారాష్ట్ర ఠానే జిల్లా కు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జితేంద్ర ఇటీవల ఒక పనిమీద ఒక పోలీసు అధికారిని కలిశారు.అయితే తాజాగా ఆ అధికారికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు నిర్ధారణ కావడం తో మంత్రిగారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

లాక్ డౌన్ సమయంలో ఇళ్లను దాటొద్దు అని సూచించిన ఆయన కలిసిన పోలీసు అధికారికి కరోనా సోకడం తో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్వీయ నిర్భంధం లోకి వెళ్లినట్లు సమాచారం.

కరోనా కేసులు రోజు రోజుకు మహారాష్ట్రలో పెరుగుతూ పోతున్నాయి.

దీనితో అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు.తప్పనిసరిగా అక్కడ కరోనా ను నియంత్రించాలి అంటే మరి కొద్దీ రోజులు ఈ లాక్ డౌన్ ను పొడిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరోపక్క జాతినుద్దేశించి రేపు ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube