బ్రో మూవీకి అలాంటి టాక్ వస్తే రూ.300 కోట్ల కలెక్షన్లు.. పవన్ ఫ్యాన్స్ టార్గెట్ ఇదేనా?

పవన్, సాయితేజ్ కలిసి నటించి బ్రో మూవీ( Bro Movie ) నుంచి తాజాగా ట్రైలర్ విడుదలై పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఫ్యాన్స్ నుంచి సైతం ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.బ్రో మూవీ తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ కానున్నా ఈ సినిమాపై ఏర్పడిన అంచనాలు అన్నీఇన్నీ కావు.

 Pawan Kalyan Fans Target About Bro Movie Collections Details Here Goes Viral In-TeluguStop.com

బ్రో ట్రైలర్( Bro Movie Trailer ) కు ఇప్పటికే 10 మిలియన్ల వ్యూస్ రాగా 4,85,000 లైక్స్ వచ్చాయి.ఇటు పవన్ క్యారెక్టర్, అటు సాయితేజ్ క్యారెక్టర్ ఫ్యాన్స్ కు నచ్చేలా ఉంది.

పవన్, సాయితేజ్ యాక్టింగ్, సముద్రఖని డైరెక్షన్, త్రివిక్రమ్ మాటలు, థమన్ బీజీఎం, బ్రహ్మనందం కామెడీ టైమింగ్ ఈ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి.ఈ సినిమాలో సాయితేజ్( Sai Tej ) కు జోడీగా కేతిక నటించగా ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో నటించారు.అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఏకంగా 300 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బ్రో ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఫ్యాన్స్ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్రో హవా మామూలుగా ఉండదు.ఏడాదిన్నర తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్నాయి.

బ్రో మూవీ ట్రైలర్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.

అటు పవన్ కళ్యాణ్, ఇటు సాయితేజ్ లకు కెరీర్ బెస్ట్ హిట్ దక్కే విధంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.సముద్రఖని ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.బ్రో సినిమా 300 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుని టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube