బ్రో మూవీకి అలాంటి టాక్ వస్తే రూ.300 కోట్ల కలెక్షన్లు.. పవన్ ఫ్యాన్స్ టార్గెట్ ఇదేనా?

పవన్, సాయితేజ్ కలిసి నటించి బ్రో మూవీ( Bro Movie ) నుంచి తాజాగా ట్రైలర్ విడుదలై పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఫ్యాన్స్ నుంచి సైతం ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

బ్రో మూవీ తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ కానున్నా ఈ సినిమాపై ఏర్పడిన అంచనాలు అన్నీఇన్నీ కావు.

బ్రో ట్రైలర్( Bro Movie Trailer ) కు ఇప్పటికే 10 మిలియన్ల వ్యూస్ రాగా 4,85,000 లైక్స్ వచ్చాయి.

ఇటు పవన్ క్యారెక్టర్, అటు సాయితేజ్ క్యారెక్టర్ ఫ్యాన్స్ కు నచ్చేలా ఉంది.

"""/"/ పవన్, సాయితేజ్ యాక్టింగ్, సముద్రఖని డైరెక్షన్, త్రివిక్రమ్ మాటలు, థమన్ బీజీఎం, బ్రహ్మనందం కామెడీ టైమింగ్ ఈ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి.

ఈ సినిమాలో సాయితేజ్( Sai Tej ) కు జోడీగా కేతిక నటించగా ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో నటించారు.

అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఏకంగా 300 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బ్రో ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఫ్యాన్స్ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్రో హవా మామూలుగా ఉండదు.

ఏడాదిన్నర తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్నాయి.

బ్రో మూవీ ట్రైలర్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. """/"/ అటు పవన్ కళ్యాణ్, ఇటు సాయితేజ్ లకు కెరీర్ బెస్ట్ హిట్ దక్కే విధంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

సముద్రఖని ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

బ్రో సినిమా 300 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుని టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.

ఈ న్యాచుర‌ల్ క్రీమ్ తో వైట్ అండ్ స్మూత్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?