VJ Deepika : లారెన్స్ మూవీ ఆడిషన్స్ కి వెళ్తే ఆ సీన్లలో నటించమని చెప్పారు.. నటి కామెంట్స్ వైరల్?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ( Casting couch )గురించి మాట్లాడాలి అంటే హీరోయిన్లు భయపడేవారు.కానీ ఈ తరం హీరోయిన్లు వారికి ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను నిర్మొహమాటంగా బయట పెట్టేస్తున్నారు.

 Pandian Stores Actress Revealed About Her Casting Couch Experience In Auditions-TeluguStop.com

ఇంకా కొంతమంది హీరోయిన్లు మరింత ధైర్యం చేసి వారికి ఎవరి నుంచి అయితే ఆ అనుభవాలు ఎదురయ్యి ఉంటాయో చదరు డైరెక్టర్లు నిర్మాతలు హీరోల పేర్లు కూడా బయట పెట్టేస్తున్నారు.ఇంకొందరు హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ.

హీరోయిన్లుగా రాణించాలంటే దర్శక, నిర్మాతలు ( Director , producers )చెప్పిన ప్రకారం ఎక్కడకు రమ్మంటే అక్కడకు వెళ్లాలని, ఏదీ చేయమంటే అది చేయాలని చాలా మంది ఆరోపణలు చేశారు.

Telugu Pandian, Vj Deepika-Movie

అప్పుడే సినిమా అవకాశాలు ఉంటాయని, చిత్ర పరిశ్రమలో మనుగడ సాగించాలంటే తాము చెప్పినట్లు చేయాల్సిందేనని వారు ఇబ్బందులకు గురి చేస్తారంటూ పేర్కొన్నారు.అయితే ఈ విషయాలను చాలా వరకు హీరోయిన్లు కొంతమంది కొట్టి పారేస్తున్నారు.ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఈ క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి బయట పెట్టిన విషయం తెలిసిందే.

తాజాగా కూడా తనకు ఎదురైనా చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.ఆమె మరెవరో కాదు వీజే దీపిక.యూట్యూబర్ స్థాయి నుండి బుల్లి తెర హోస్ట్ గా మారింది వీజే దీపిక( VJ Deepika ).ఆమెకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది.ప్రముఖ సీరియల్ పాండియన్ స్టోర్స్‌లో( Serial Pandyan Stores ) ఐశ్వర్య పాత్రను పోషిస్తున్న దీపిక ఇటీవల తనకు ఎదురైన చేదు సంఘటన గురించి వెల్లడించింది.

Telugu Pandian, Vj Deepika-Movie

రాఘవ లారెన్స్ రాబోయే చిత్రంలో అతడి చెల్లెలి పాత్ర కోసం ఆడిషన్ కు వెళ్లాను.అందులో దాదాపుగా సెలెక్ట్ అయిపోయాను అనుకున్నాను అయితే దర్శకుడు ఈ సినిమాలో ఒక ముద్దు సీన్ ఉందని, ఆడిషన్ సమయంలో ఆ సీన్ చేసి చూపెట్టమని కోరడంతో షాక్ గురయ్యాను.నేను చేయనని చెప్పాను.

అయినప్పటికీ దర్శకుడు వదలకుండా ముద్దు సీన్ రిహార్సల్ కింద చేసి చూపించమనే సరికి రిజెక్ట్ వచ్చేశాను అని చెప్పుకొచ్చారు.తనను మానిప్యులేట్ చేసేందుకు దర్శకుడు పన్నిన వ్యూహం తనను ఎంతో బాధించిందని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube